Hardik Pandya: ఆ ప్రదర్శనకు నా భాగస్వామి కూడా కారణం : హార్దిక్ పాండ్య
ABN , Publish Date - Dec 10 , 2025 | 02:35 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా రెండు నెలలు ఆటకు దూరమై.. సౌతాఫ్రికాతో తొలి టీ20లో రీఎంట్రీ ఇచ్చాడు. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనకు తన భాగస్వామి కూడా ఓ కారణమని చెప్పుకొచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(59*)ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆసియ కప్‌లో గాయపడి దాదాపు రెండు నెలల తర్వాత ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ అద్భుతంగా రాణించాడు. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం హార్దిక్(Hardik Pandya) మాట్లాడాడు.
‘గాయం తర్వాత నేను మరింత దృఢంగా తిరిగొచ్చా. గాయాలు మనల్ని మానసికంగా పరీక్షిస్తాయి. స్ట్రాంగ్‌గా నిలబడటం వల్లే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. నిజానికి మనల్ని మనం కచ్చితంగా నమ్మాలి. మన మీద మనకే విశ్వాసం లేనప్పుడు ఇతరులు మనల్ని ఎలా నమ్ముతారు. అలాగే మైదానంలోకి దిగిన తర్వాత ప్రతి క్షణం ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా. జనాన్ని ఆకట్టుకునేలా ఆడాలనుకోవడమే నాకు అసలైన ప్రేరణ. అలాగే నేను రాణించడానికి నా భాగస్వామి కూడా కారణం. ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మంచి విషయాలు జరిగాయి’ అని హార్దిక్ పాండ్య వెల్లడించాడు. కాగా హార్దిక్ పాండ్య మహికా శర్మతో రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్
సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు