Asia Cup 2025: టీమిండియాకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:28 AM
భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అయితే వచ్చే నెల 9 నుంచి జరిగే ఆసియాక్‌పలో పాల్గొనకుండా భారత జట్టును అడ్డుకోలేమని తెలిపింది. దీంతో...
ఆసియాక్‌పలో ఆడేందుకు అనుమతి
భారత్-పాక్ మ్యాచ్‌కు మార్గం సుగమం
ద్వైపాక్షిక సిరీ్‌సలకు అవకాశం లేదు
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అయితే వచ్చే నెల 9 నుంచి జరిగే ఆసియాక్‌పలో పాల్గొనకుండా భారత జట్టును అడ్డుకోలేమని తెలిపింది. దీంతో సెప్టెంబరు 14న దుబాయ్‌లో జరిగే దాయాదుల పోరుకు అడ్డంకి తొలగినట్టయింది. ఈ టోర్నీలో భారత్-పాక్ మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్‌లో సరికొత్త జాతీయ క్రీడా బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఏ క్రీడలోనైనా ఇకపై భారత్‌కు చెందిన అథ్లెట్లు పాక్‌లో.. పాక్ ఆటగాళ్లు భారత్‌లోగానీ పర్యటించడం కుదరదని తేల్చింది. అంతేకాకుండా ఈ రెండు దేశాల జట్ల ద్వైపాక్షిక సిరీస్‌లు తటస్థ వేదికలపైనా జరగబోవని స్పష్టం చేసింది. అయితే ఒలింపిక్ చార్టర్‌ను అనుసరించి ఐసీసీ వరల్డ్‌కప్, ఆసియాక్‌పలాంటి మెగా టోర్నీల్లో పాక్‌తో తలపడేందుకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదని క్రీడాశాఖ పేర్కొంది. వీటికి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తే మాత్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. మరోవైపు భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైతే ఈ నిర్ణయంలో మార్పు ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానంగా.. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేవని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా క్రీడా ఉత్సవాలు: ఈనెల 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు కేంద్ర నిర్ణయించింది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే దేశంలో క్రీడా సంస్కృతిని చాటేందుకు ప్రతీ గ్రామం, జిల్లా, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, యూనివర్సిటీల్లో ఆటల పోటీలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తామని క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
కొత్త చట్టం ప్రకారం
బీసీసీఐ ఎన్నికలు..
వచ్చే నెల చివరి వారంలో బీసీసీఐ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వాటిని నూతన జాతీయ క్రీడా చట్టం ప్రకారమే జరపాలని క్రీడా శాఖ భావిస్తోంది. కానీ ఆ సమయానికి కొత్త చట్టం నియమ నిబంధనలు కార్యరూపం దాల్చాల్సి ఉంటుంది. లేని పక్షంలో సుప్రీం కోర్టు నియమిత జస్టిస్ లోధా కమిటీ మార్గదర్శకాలను అనుసరించే జరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం బోర్డు అధ్యక్షుడి గరిష్ట వయస్సు 70 ఏళ్ల లోపే ఉండాలి. కానీ జాతీయ క్రీడా చట్టం ప్రకారం 75 ఏళ్లున్నా పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయస్సు 70 దాటినప్పటికీ.. అతడు తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతున్నాడు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి