Gautam Gambhir: రోహిత్, కోహ్లీపై గంభీర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:52 PM
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయినప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయినప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ముఖ్యంగా మూడో వన్డేలో మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీతో కలిసి టీమిండియాను గెలిపించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సీనియర్ ఆటగాళ్లపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు (Gautam Gambhir).
'శుభ్‌మన్, రోహిత్ నెలకొల్పిన భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసి మంచి పునాది వేశారు. ఆ తరువాత రోహిత్, విరాట్ నెలకొల్పిన భాగస్వామ్యం అద్భుతం. ఇది మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది. మరో సెంచరీ చేసిన రోహిత్ శర్మకి ప్రత్యేక అభినందనలు. అద్భుతమైన ఇన్నింగ్స్. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, రోహిత్ ఈ మ్యాచ్‌ను ముగించాడు. విరాట్ కూడా అలాగే అద్భుతంగా ఆడాడు' అని గంభీర్ ప్రశంసించాడు (Gambhir praises Rohit).
గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు (Gambhir about Kohli). ఆ వీడియోను తాజాగా బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్, కోహ్లీ తమ కెరీర్లను ముగించే దశలో ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పుడు వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు కెరీర్ కొనసాగించాలనే ఆశతో ఉన్నారు. అయితే అప్పటివరకు ఫామ్, ఫిట్‌నెస్ కాపాడుకోవడంపైనే వారి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రోహిత్ మనసును చదివిన మెజీషియన్
వేధింపుల ఘటన.. నవీ ముంబైలో భారీగా భద్రతా ఏర్పాట్లు
For More Sports News And Telugu News