Kuldeep Yadav: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. నాలుగో టెస్టులో అతడికి చోటిస్తే భారత్‌కు విజయం
ABN , Publish Date - Jul 18 , 2025 | 01:23 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వెనకబడ్డ టీమిండియాకు మాంచెస్టర్‌లో జరగనున్న నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఈ టెస్టుకు కుల్‌దీప్ యాదవ్‌ను రంగంలోకి దించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ వెనుకబడింది. మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో టెస్టులో గెలిస్తేనే సిరీస్ సొంతమయ్యేది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి ఉందని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, నాలుగో టెస్టులో విజయం సాధించేందుకు కుల్‌దీప్ యాదవ్‌ను రంగంలోకి దించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సూచించాడు.
టీమిండియా స్క్వాడ్‌లో భాగమైనప్పటికీ కుల్‌దీప్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఇంకా చోటు దక్కలేదు. ఇప్పటివరకూ అతడు ఇంగ్లండ్‌పై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ నేపథ్యంలో కుల్‌దీప్‌ను రంగంలోకి దించాలని క్లార్క్ సూచించాడు. ‘ఇండియా అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా జడేజా ప్రదర్శన అద్భుతం. అయితే నేనొక విషయం బహిరంగంగా చెప్పదలుచుకున్నాను. ప్లేయింగ్ ఎలెవెన్‌లో కుల్‌దీప్‌కు చోటివ్వాలి. అతడిని రంగంలోకి దించండి. ఎలాగొలా ఈ పని చేయండి’
‘వాస్తవానికి వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అవసరమైనప్పుడు రన్స్ కూడా స్కోర్ చేశాడు. ఇక జడేజా పర్‌ఫార్మెన్స్ అద్భుతం. ఎన్నో సందర్భాల్లో జట్టుకు అండగా నిలిచాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, మూడో టెస్టులో అతడికి మరో ఎండ్‌లో మద్దతుగా ఎవరైనా ఉంటే బాగుండేది. అతడికీ ఇదే అనిపించి ఉంటుంది’ అని అన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్లార్క్ సూచనను గిల్, గంభీర్ స్వీకరిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
ఇక మాంచెస్టర్‌లో జరగనున్న నాలుగో టెస్టులో బుమ్రా అందుబాటులోకి వస్తాడా రాడా అన్న అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో భారత్ గెలవాలంటే నాలుగో టెస్టులో భారత్‌కు విజయం తప్పనిసరి. అయితే, బుమ్రాను బరిలోకి దించేందుకు టీమిండియా కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘చివరి రెండు టెస్టుల్లో ఏదోక దాంట్లో అతడిని రంగంలోకి దించుతాము. కీలకమైన నాలుగో టెస్టులోనే బుమ్రాను దింపే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై మాంచెస్టర్‌లోనే నిర్ణయం తీసుకుంటాము’ అని అసిస్టెంట్ కోచ్ రియనె టెన్ డోస్కాటే తెలిపాడు.
ఇవీ చదవండి:
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి