Errani Vavassori Retain US Open: ఎరాని జోడీ వన్స్‌మోర్
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:21 AM
డిఫెండింగ్ చాంప్ సారా ఎరాని జోడీ పునర్ వ్యవస్థీకరించిన యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకొంది. గురువా రం జరిగిన ఫైనల్లో ఇటలీ జంట ఎరాని-ఆండ్రియా వవస్సోరి జోడీ 6-3, 5-7, 10-6తో...
ఫైనల్లో స్వియటెక్ జంటపై గెలుపు
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్
న్యూయార్క్: డిఫెండింగ్ చాంప్ సారా ఎరాని జోడీ పునర్ వ్యవస్థీకరించిన యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకొంది. గురువా రం జరిగిన ఫైనల్లో ఇటలీ జంట ఎరాని-ఆండ్రియా వవస్సోరి జోడీ 6-3, 5-7, 10-6తో మూడో సీడ్ ఇగా స్వియటెక్-కాస్పర్ రూడ్ జంటపై గెలిచింది. తుది పోరును మాత్రం రెగ్యులర్ ఫార్మాట్‌లో నిర్వహించారు. సింగిల్స్ స్టార్లతో డ్రాను నింపేసినా అంతిమంగా డబుల్స్ స్పెషలి్‌స్టలకే టైటిల్ దక్కింది. అంతకుముందు జరిగిన సెమీ్‌సలో ఎరాని-వవస్సోరి జంట 4-2, 4-2తో డేనియల్ కొలిన్స్-క్రిస్టియన్ హ్యారిసన్‌ను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో స్వియటెక్-రూడ్ ద్వయం 3-5, 5-3, 10-8తో టాప్ సీడ్ జెస్సికా పెగుల-జేక్ డ్రేపర్‌పై పోరాడి నెగ్గింది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి