Womens World Cup First Semifinal Preview: ఫైనల్ బెర్త్ ఎవరిదో
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:27 AM
వరుసగా రెండోఫైనల్‌పై ఇంగ్లండ్ గురిపెట్టగా.. దక్షిణాఫ్రికా తొలిసారి వన్డే వరల్డ్‌కప్ తుది పోరుకు చేరి చరిత్ర సృష్టించాలనుకొంటోంది. ఈ క్రమంలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో నాలుగుసార్లు చాంపియన్ ఇంగ్లండ్‌తో...
మ. 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
దక్షిణాఫ్రికాకు స్పిన్ గండం
ఫేవరెట్ ఇంగ్లండ్
నేడు తొలి సెమీస్
మహిళల వన్డే వరల్డ్‌కప్
గువాహటి: వరుసగా రెండోఫైనల్‌పై ఇంగ్లండ్ గురిపెట్టగా.. దక్షిణాఫ్రికా తొలిసారి వన్డే వరల్డ్‌కప్ తుది పోరుకు చేరి చరిత్ర సృష్టించాలనుకొంటోంది. ఈ క్రమంలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో నాలుగుసార్లు చాంపియన్ ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. లీగ్ దశలో సఫారీలను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే, మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శనతో బదులు తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఘోరంగా తడబడుతున్న లారా వొల్వార్ట్ సేన ఆ బలహీనతకు చెక్ చెప్పాలనుకొంటోంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. కానీ, ఆ తర్వాత ఒత్తిడిని అధిగమిస్తూనే ఐదు మ్యాచ్‌లు గెలిచి నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకొంది. కానీ, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఘోరంగా ఓడడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదే. కెప్టెన్ లారా వొల్వార్ట్, తన్జిమ్ బ్రిట్స్, మరిజానె కాప్, డి క్లెర్క్ జట్టు బ్యాటింగ్‌కు ప్రధాన బలం. బౌలింగ్‌లో చ్లో ట్రయాన్, ఎమ్‌లాబా, క్లాస్, కాప్‌పై జట్టు ఆధారపడింది. మరోవైపు ఇంగ్లండ్ ఫుల్ జోష్‌లో ఉంది. అమీ జోన్స్, బ్యూమాంట్, హీథర్ నైట్ బ్యాట్‌తో అదరగొడుతున్నారు. సారథి సివర్ బ్రంట్ ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకు ప్లస్‌గా మారింది. వికెట్ స్పిన్‌కు సహకరించే అవకాశాలుండడంతో సోఫీ ఎకెల్‌స్టోన్, లిండ్సే స్మిత్, చార్లీ డీన్ నుంచి దక్షిణాఫ్రికా సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, గాయంతో బాధపడుతున్న ఎకెల్‌స్టోన్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు లేవు.
ఈ వార్తలు కూడా చదవండి...
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు
Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు
Read Latest AP News And Telugu News