Share News

Elavenil Valarivan Shines with Silve: వలరివన్‌ స్వర్ణ కాంతులు

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:03 AM

భారత ఏస్‌ షూటర్‌ ఎలవెనిల్‌ వలరివన్‌ ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో పసిడి పతకం కొల్లగొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో ..

Elavenil Valarivan Shines with Silve: వలరివన్‌ స్వర్ణ కాంతులు

షిమ్‌కెంట్‌ (కజకిస్థాన్‌): భారత ఏస్‌ షూటర్‌ ఎలవెనిల్‌ వలరివన్‌ ఆసియా చాంపియన్‌షి్‌ప్సలో పసిడి పతకం కొల్లగొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో 253.6 పాయింట్లతో వలరివన్‌ టైటిల్‌ దక్కించుకుంది. చైనా, కొరియా రజత కాంస్యాలు అందుకున్నాయి. స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అభయ్‌ సింగ్‌ సెఖాన్‌/గనేమత్‌ సెఖాన్‌ ద్వయం కాంస్యం గెలుపొందింది. ఇక..మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో వలరివన్‌, మెహూలీ, అనన్యా నాయుడు త్రయం కాంస్యం సాధించింది. జూనియర్‌ విభాగంలో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగింది. జూనియర్‌ స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కేటగిరీలో హర్‌మెహర్‌/యశస్వీ రాథోడ్‌ జోడీ పసిడి చేజిక్కించుకుంది. మహిళల జూనియర్‌ 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో శాంభవీ శ్రవణ్‌, హృద్యశ్రీ, ఇషా అనిల్‌ త్రయం స్వర్ణం కైవసం చేసుకుంది.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 04:03 AM