Share News

US Open 2025: ఎవరిదో ఆఖరి పంచ్‌

ABN , Publish Date - Aug 24 , 2025 | 05:06 AM

పురుషుల డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినర్‌, రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కారజ్‌ యూఎస్‌ ఓపెన్‌లో మరోసారి ఫేవరెట్‌లుగా బరిలోకి దిగనున్నారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సినర్‌పై అల్కారజ్‌ గెలిస్తే.. వింబుల్డన్‌లో అల్కారజ్‌కు సినర్‌ షాకిచ్చాడు....

US Open 2025: ఎవరిదో ఆఖరి పంచ్‌

రాత్రి 8.30 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో..

సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ నేటినుంచే

  • ఫేవరెట్లు సినర్‌, అల్కారజ్‌

  • 25వ గ్రాండ్‌స్లామ్‌పై జొకోవిచ్‌ గురి

న్యూయార్క్‌: పురుషుల డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినర్‌, రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కారజ్‌ యూఎస్‌ ఓపెన్‌లో మరోసారి ఫేవరెట్‌లుగా బరిలోకి దిగనున్నారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సినర్‌పై అల్కారజ్‌ గెలిస్తే.. వింబుల్డన్‌లో అల్కారజ్‌కు సినర్‌ షాకిచ్చాడు. మరి.. ఆదివారం నుంచి జరిగే ఈ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఎవరిది పైచేయిగా అవుతుందో చూడాలి. అయితే, రెండో పార్శ్వంలో ఉన్న అల్కారజ్‌కు మెద్వెదెవ్‌, నొవాక్‌ జొకోవిచ్‌ రూపంలో కఠిన సవాల్‌ ఎదురవనుంది. మెయిన్‌ డ్రాలో తొలి రౌండ్‌లో రిల్లీ ఓప్లేకాతో కార్లోస్‌ తలపడనున్నాడు. క్వార్టర్స్‌లో మాజీ చాంపియన్‌ మెద్వెదెవ్‌ను ఎదుర్కోవాల్సి రావచ్చు. మరోవైపు ఏడోసీడ్‌ జొకోవిచ్‌ తన 25వ గ్రాండ్‌స్లామ్‌ కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒకవేళ జొకో, అల్కారజ్‌ ఇద్దరూ ముందుకు సాగితే.. సెమీస్‌లో ఒకరితో ఒకరు తలపడాల్సి ఉంటుంది. గతంలో ఇద్దరి ముఖాముఖిలో జొకో 5-3తో కార్లోస్‌పై పైచేయిగా నిలిచాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో కూడా అల్కారజ్‌ను నొవాక్‌ ఓడించాడు. మరోవైపు టాప్‌ సీడ్‌ సినర్‌.. తొలి రౌండ్‌లో విట్‌ కోప్రివా (చెక్‌)తో ఆడనున్నాడు. అయితే, క్వార్టర్స్‌లో గతేడాది సెమీఫైనలిస్ట్‌ జాక్‌ డ్రేపర్‌తో ఆడే చాన్సున్న సినర్‌కు సెమీస్‌లో మూడో సీడ్‌ జ్వెరెవ్‌ రూపంలో ముప్పుపొంచి ఉండొచ్చు. నాలుగో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌, ఐదో సీడ్‌ డ్రేపర్‌, బెన్‌ షెల్టన్‌, కచనోవ్‌ కూడా టైటిల్‌ వేటలో ఉన్నారు.


3-sports.jpg

సబలెంక టైటిల్‌ నిలబెట్టుకొనేనా?

మహిళల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంప్‌ అరియానా సబలెంక సరికొత్త రికార్డు సృష్టించాలనుకొంటోంది. 2014లో సెరెనా విలియమ్స్‌ తర్వాత వరుసగా రెండోసారి యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన క్రీడాకారిణిగా నిలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, రెండో సీడ్‌ స్వియటెక్‌, మూడో సీడ్‌ కొకొ గాఫ్‌ నుంచి సబలెంకకు సవాల్‌ ఎదురవనుంది. మిగతా సీడెడ్‌ స్టార్లు జెస్సికా పెగుల, ఆండ్రీవ, పవోలిని, రిబకినా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వింబుల్డన్‌ నెగ్గిన జోరు మీదున్న స్వియటెక్‌ మరో గ్రాండ్‌స్లామ్‌తో సీజన్‌ను ఘనంగా ముగించాలనుకొంటోంది. మొదటి రౌండ్‌లో రెబెక్కాతో సబలెంకా, ఎమిలి యానాతో స్వియటెక్‌ ఆడనున్నారు. కొకొ గాఫ్‌ కూడా సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్‌తో మెరవాలనుకొంటోంది. ఇక, వైల్డ్‌కార్డ్‌తో ఎంట్రీ ఇస్తున్న 45 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌ తొలి రౌండ్‌లో ముచోవాతో తలపడనుంది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 05:06 AM