ISSF World Championship: అంజుమ్ కౌర్‌కు నిరాశ
ABN , Publish Date - Nov 13 , 2025 | 02:54 AM
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో బుధవారం భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. యువ షూటర్ ఆషి చౌక్సీ, ఒలింపియన్లు అంజుమ్ మోద్గిల్, సిఫ్ట్ కౌర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో...
కైరో (ఈజిప్టు): ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షి్‌పలో బుధవారం భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది. యువ షూటర్ ఆషి చౌక్సీ, ఒలింపియన్లు అంజుమ్ మోద్గిల్, సిఫ్ట్ కౌర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో కనీసం ఫైనల్స్ కూడా చేరలేకపోయారు. క్వాలిఫికేషన్స్‌లో ఆషి 15వ, అంజుమ్ 17వ, సిఫ్త్ కౌర్ 48వ స్థానాలకు పరిమితమ య్యారు. ఇక, గురువారం జరిగే పోటీల్లో మను భాకర్, ఇషా సింగ్, రాహీ సర్నోబాత్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో తలపడనున్నారు. ప్రస్తుతం టోర్నీలో భారత్ 3 స్వర్ణా లు, 5 రజతాలు, 3 కాంస్యాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 8 స్వర్ణాలు సహా మొత్తం 15 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి..
26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి