Devdutt Padikkal: దేవ్‌దత్ పడిక్కల్ మెరుపు సెంచరీ.. కర్ణాటక ఘన విజయం
ABN , Publish Date - Dec 02 , 2025 | 02:51 PM
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. పడిక్కల్ మెరుపు శతకం దెబ్బకు కర్ణాటక జట్టు 145 పరుగుల తేడాతో తమిళనాడుపై ఘన విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్(Devdutt Padikkal) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇవాళ (డిసెంబర్ 2) తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే సెంచరీ (102) బాదాడు. ఈ శతకంలో10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. పడిక్కల్ విధ్వంసకర సెంచరీతో పాటు శరత్ (23 బంతుల్లో 53), స్మరణ్ రవిచంద్రన్(Smaran Ravichandran) (29 బంతుల్లో 46 నాటౌట్) కూడా సత్తా చాటడంతో కర్ణాటక జట్టు భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన తమిళనాడు 100 పరుగులకే ఆలౌటైంది. దీంతో 145 పరుగుల భారీ తేడాతో కర్ణాటక ఘన విజయం సాధించింది
టాస్ గెలిచిన తమిళనాడు బౌలింగ్(Karnataka vs Tamil Nadu) ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన కర్ణాటక జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి.. 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు శరత్, మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నటరాజన్ బౌలిగ్ లో మయాంక్ అగర్వాల్ పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ కు వచ్చిన దేవదత్ పడిక్కల్ తమిళనాడు బౌలర్లపై విరుచకపడ్డాడు.
దేవదత్ విధ్వంసం:
దేవ్‌దత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ 24, కరుణ్ నాయర్ 4 పరుగులకే ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్ 2, టి నటరాజన్ ఒక వికెట్ తీశారు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా పడిక్కల్ నిలిచాడు. కాగా, ప్రస్తుత SMAT సీజన్(Syed Mushtaq Ali Trophy)లో ఇప్పటికే ఎనిమిది సెంచరీలు (పడిక్కల్ శతకంతో కలిపి) నమోదయ్యాయి. ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే 2, అభిమన్యు ఈశ్వరన్, రోహన్ కున్నుమ్మల్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఉర్విల్ పటేల్ తలో సెంచరీ చేశారు.
ఇవి కూడా చదవండి:
Moeen Ali IPL Retirement: ఐపీఎల్‌కు మరో స్టార్ ప్లేయర్ దూరం
Kane Williamson Record: కేన్ విలియమ్సన్ ఖాతాలో భారీ రికార్డు