World Athletics Championship: దీప్తికి స్వర్ణం
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:34 AM
వర్టెస్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో వరంగల్ అమ్మాయి జీవాంజి దీప్తి పసిడి పతకం దక్కించుకుంది. ఆదివారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో...
పర్వతగిరి (ఆంధ్రజ్యోతి): వర్టెస్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో వరంగల్ అమ్మాయి జీవాంజి దీప్తి పసిడి పతకం దక్కించుకుంది. ఆదివారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన 400 మీటర్ల టీ20 కేటగిరీ పరుగులో దీప్తి 55.92 సెకన్లలో రేసును పూర్తి చేసి, అగ్రస్థానాన్ని దక్కించుకుంది. కరీనా పైమ్ (పోర్చుగల్) రజతం, టెలయ బ్లాక్‌స్మిత్ (ఆస్ట్రేలియా) కాంస్యం సాధించారు. ఇటీవల జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో దీప్తి రజతం గెలవడం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News