Women's WC 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా..
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:47 PM
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నాడు. రెండు గంటలు ఆలస్యంగా టాస్ వేశారు. దీంట్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025(Women's WC 2025) తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో టీమిండియా, సౌతాఫ్రికా( India vs South Africa) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నాడు. రెండు గంటలు ఆలస్యంగా టాస్ వేశారు. దీంట్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
సాధారణంగా టాస్ 2.30 గంటలకే పడాల్సి ఉండగా.. వర్షం కారణంగా అరగంట ఆలస్యం అయింది. మళ్లీ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం పరిసరాల్లో వర్షం మొదలవ్వడంతో పిచ్‌పై కవర్లు కప్పారు. దీంతో టాస్‌తో పాటు ఆట కూడా మరింత ఆలస్యం అయింది.
గెలుపెవరిదో..?
25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్‌కు కొత్త ఛాంపియన్ కానుంది. ఉత్కంఠభరితంగా మారిన ఈ టోర్నమెంట్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు మొదలైంది. భారత జట్టుకు ఇది మూడో ఫైనల్ కాగా ఒక్కసారి కూడా కప్ అందుకోలేదు. దక్షిణాఫ్రికా తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. తమ తొలి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడే అవకాశం ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.
తుది జట్లు ఇవే..
భారత జట్టు: షఫాలి వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీచరణి, రేణికా ఠాకూర్
సౌతాఫ్రికా జట్టు: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, అన్నెకే బోష్, సునే లూస్, మారిజాన్ కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), అన్నరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మ్లాబా