Women’s WC 2025: అలముకున్న ‘వాన’ భయం..
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:47 PM
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌పై ఉత్కంఠతో పాటు వర్షం భయం కూడా అలముకుంది. నవీ ముంబైలోని మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిన్నపాటి వర్షం మొదలైంది. దీంతో పిచ్‌పై మళ్లీ కవర్లు కప్పుతున్నారు. దీంతో మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్-2025 (Women’s WC 2025) మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌పై ఉత్కంఠతోపాటు వర్షం భయం కూడా అలముకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా ఫైనల్ పోరులో తలపడనున్నాయి.
షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ(ఆదివారం) 2:30గంటలకు టాస్ పడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. మ్యాచ్ జరిగే స్టేడియం(Navi Mumbai weather) పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిన్నపాటి వర్షం మొదలైంది. దీంతో పిచ్‌పై మళ్లీ కవర్లు కప్పుతున్నారు. దీంతో మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటికే చాలా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించగా.. ఫైనల్ మ్యాచ్‌పైనా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగే ఆట సమయంలో 58శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.
రిజర్వ్ డేకి వెళ్తుందా..?
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే సోమవారం రిజర్వ్ డే ఉంటుంది. ఈరోజు(ఆదివారం) కనీసం 20 ఓవర్ల ఆట అయినా జరిగేలా చూడనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే.. మ్యాచ్ ఎక్కడైతే ఆగిందో.. అక్కడి నుంచే సోమవారం మొదలు పెడతారు. ఒక్కసారి టాస్ పడితే. ఆ ఆట లైవ్‌గానే పరిగణిస్తారు. సోమవారం కూడా వరుణుడు కనికరించకపోతే.. ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
IND VS AUS T20: ముగిసిన ఆసీస్ బ్యాటింగ్..భారత్ టార్గెంట్ ఎంతంటే?
Harmanpreet Kaur: విజయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాం: హర్మన్