Asia Cup 2025 : అభిషేక్ ఊచకోత, తిలక్ వర్మ విజృంభణ, శ్రీలంక టార్గెట్ 203
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:22 PM
ఆసియా కప్‌లో భారత బ్యాటర్లు శ్రీలంక బౌలింగ్‌ను ఊచకోత కోశారు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ శ్రీలంకేయులు విసిరన బంతుల్ని పచ్చడి కింద కొట్టేశాడు. అటు, తిలక్ వర్మ సైతం విరుచుకుపడ్డాడు. సంజు, చివర్లో అక్షర్ పటేల్ రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
దుబాయ్, సెప్టెంబర్ 26 : దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత బ్యాటర్లు శ్రీలంక బౌలింగ్ ను ఊచకోత కోశారు. చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకకు భారత్ బ్యాంటింగ్ ఆర్డర్ చుక్కలు చూపించింది. మొత్తం 19 మ్యాచ్ ల టోర్నీ 18వ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు.. ఓపెనర్ అభిషేక్ శర్మ శ్రీలంకేయులు విసిరిన బంతుల్ని పచ్చడి కింద కొట్టేశాడు. సిక్సర్లు, ఫోర్లతో శ్రీలంక మీద విరుచుకుపడ్డాడు.
అభిషేక్ శర్మ కేవలం 31 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. తర్వాత శుభమన్ గిల్, స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా, 4, 12 పరుగులకు ఔట్ అవ్వగా, తిలక్ వర్మ శ్రీలంక బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేశాడు. అటు, సంజు శాంసన్ కూడా 23 బంతుల్లో 39 పరుగులు చేయడం, చివరిలో అక్షర్ పటేల్ 15 బంతుల్లో 21 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.
కేవలం 20 ఓవర్లలో 202 పరుగులు చేసి, శ్రీలంకకు 203 పరుగుల టార్గెట్ ను భారత్ నిర్దేశించింది. అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుని, భారత్ ను బ్యాంటింగ్ కు ఆహ్వానించాడు. శ్రీలంక బౌలర్లు.. భారత బ్యాటింగ్ ఆర్డర్ ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు. మొత్తం ఆరుగురు శ్రీలంక బౌలర్లు బౌలింగ్ చేయగా, తుషార మినహా మిగతా వారంతా తలో వికెట్ చేజిక్కించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News