Share News

SA vs Eng: కష్టాల్లో ఇంగ్లండ్.. 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ టీమ్..

ABN , Publish Date - Mar 01 , 2025 | 03:47 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆదిలోనే దక్షిణాఫ్రికా బౌలర్లు దెబ్బకొట్టారు. ఓపెనర్లు స్వల్ప పరుగులకే అవుట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

SA vs Eng: కష్టాల్లో ఇంగ్లండ్.. 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ టీమ్..
SA vs Eng

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో పడింది. గ్రూప్-బికి సంబంధించి జరుగుతున్న చివరి మ్యాచ్‌లో (SA vs Eng) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆదిలోనే దక్షిణాఫ్రికా బౌలర్లు దెబ్బకొట్టారు. ఓపెనర్లు స్వల్ప పరుగులకే అవుట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలించింది (Champions Trophy 2025).


ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (8)ను మార్కో జాన్సన్ ఆరంభంలోనే అవుట్ చేసి షాకిచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జేమీ స్మిత్‌ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి పరుగులేమీ చేయకుండా మార్కో జాన్సన్ బౌలింగ్‌‌లో అవుటయ్యాడు. కాస్త కుదురుకున్నట్టు కనిపించిన ఓపెనర్ బెనె డకెట్‌ (24)ను కూడా జాన్సన్ పెవిలియన్‌కు పంపించాడు. మొత్తం మూడు వికెట్లు జాన్సన్ ఖాతాలోనే పడ్డాయి. ప్రస్తుతం జో రూట్ (28 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది.


ఇంగ్లండ్‌ జట్టుకు కెప్టెన్‌గా జోస్ బట్లర్‌కు ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్సీని వదిలేస్తానని రూట్ ఇప్పటికే ప్రకటించాడు. వరుస రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇంగ్లండ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు సెమీస్ బెర్త్‌లు ఇప్పటికే కన్ఫామ్ అయిపోయాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరుకున్నాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. నెట్ రన్‌రేట్ ప్రకారం దక్షిణాఫ్రికా సెమీస్ బెర్త్‌కు చేరువలో ఉంది. ఈరోజు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోతే అఫ్గాన్‌కు సెమీస్ బెర్త్ దొరుకుతుంది.

ఇవి కూడా చదవండి..

ఆఫ్ఘాన్ ఆశలు.. సంచలనం జరగాలి

ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు

రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 03:48 PM