Share News

Bronco Test: ఆటగాళ్లకు అగ్నిపరీక్ష బ్రాంకో టెస్ట్‌

ABN , Publish Date - Aug 22 , 2025 | 02:25 AM

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సమస్య టీమిండియాను వెంటాడుతోంది. ఎవరు ఎంత ఫిట్‌గా ఉన్నారో కచ్చితంగా తెలుసుకోలేకపో తున్నారు. కొందరైతే పెయిన్‌కిల్లర్లు తీసుకొని మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నారని వార్తలు కూడా వచ్చాయి....

Bronco Test: ఆటగాళ్లకు అగ్నిపరీక్ష బ్రాంకో టెస్ట్‌

  • ఫిట్‌నెస్‌ను కొలిచేందుకు సరికొత్త ప్రమాణం

  • రగ్బీ తరహా పరీక్షను ప్రవేశపెట్టిన బీసీసీఐ

న్యూఢిల్లీ: ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సమస్య టీమిండియాను వెంటాడుతోంది. ఎవరు ఎంత ఫిట్‌గా ఉన్నారో కచ్చితంగా తెలుసుకోలేకపో తున్నారు. కొందరైతే పెయిన్‌కిల్లర్లు తీసుకొని మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజా ఇంగ్లండ్‌ టూర్‌ని గమనిస్తే..మనోళ్ల ఫిట్‌నెస్‌ ఎంత తక్కువ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. దీనికి బుమ్రానే ఉదాహరణ. ఈ నేపథ్యంలో భారత జట్టు ఫిట్‌నెస్‌ విషయంలో బీసీసీఐ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలనుకొంటోం ది. ఇందులో భాగంగా రగ్బీ ఆటగాళ్లను పరీక్షించే బ్రాంకో టెస్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టీమిండియా కొత్త ఫిట్‌నెస్‌, కండీషనింగ్‌ కోచ్‌ అడ్రియన్‌ లే రూ ఈ టెస్ట్‌ను ప్రవేశపెట్టగా..చీఫ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ దానికి మద్దతు ప్రకటించాడు. తాజాగా జరిగే ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో యో-యో టెస్ట్‌తోపాటు బ్రాంకో టెస్ట్‌ కూడా పాస్‌ కావాలి. దీంతోపాటు 2 కిలోమీటర్ల టైమ్‌ ట్రయల్‌ను అధిగమించాలి.

ఏమిటీ బ్రాంకో టెస్ట్‌?

ప్లేయర్ల సత్తువ, వేగంతోపాటు కార్డియో వాస్క్యులర్‌ కండిషన్‌ను కొలిచేందుకు రూపొందించిన తీవ్రమైన రన్నింగ్‌ డ్రిల్‌ ఇది. ఆటగాళ్ల శరీరానికి, మైండ్‌కు సవాళ్లు విసురుతుంది. క్రికెటర్‌ ఫిట్‌నె్‌సలోని సూక్ష్మమైన లోపాలు కూడా ఈ టెస్ట్‌లో బయటపడతాయి. బ్రాంకో టెస్ట్‌లో 20, 40, 60 మీటర్ల షటిల్స్‌ ఉంటాయి. ప్రతి దూరాన్ని ఐదు సెట్లపాటు విరామం తీసుకోకుండా పూర్తి చేయాలి. అంటే ఒక్కోటి ఐదుసార్ల చొప్పున మొత్తం 15 సార్లు... 1200 మీటర్ల దూరాన్ని ఆగకుండా పరిగెత్తాలి. దాన్ని ఆరు నిమిషాల్లోనే పూర్తి చేయాలి. కాగా రెండు కిలోమీటర్ల టైమ్‌ ట్రయల్‌ను బీసీసీఐ కొనసాగించనుంది.

బ్రాంకో టెస్ట్‌ ఇలా...

ప్రతి సెట్‌నూ ఐదేసి సార్లు పరిగెత్తాలి

ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 02:25 AM