Babar Azam: కొనసాగుతున్న బాబర్ ఆజామ్ ఫ్లాప్ షో.. కోహ్లీ చెత్త రికార్డు సమం..
ABN , Publish Date - Nov 12 , 2025 | 08:36 AM
పాక్ జట్టుకు సంబంధించి అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచిన బాబర్ ఆజామ్, గత కొద్ది కాలంగా వన్డేల్లో నిలకడ లేమితో బాధపడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ అదే పేలవ ఫామ్ కనబరుస్తున్నాడు.
సమకాలీన క్రికెట్‌లో పాకిస్థాన్‌కు చెందిన బాబార్ ఆజామ్ ఉత్తమ బ్యాటర్‌గా చాలా మంది అభిమానాన్ని చూరగొన్నాడు. కెరీర్ ఆరంభంలో అతడు స్థిరంగా పరుగులు చేసి పాక్ జట్టుకు కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. దీంతో అతడిని అందరూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పోల్చేవారు. అయితే గత కొంత కాలంగా బాబర్ తీవ్రంగా విఫలమవుతున్నాడు. వరుసగా నిరాశపరుస్తున్నాడు. తాజాగా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు (Babar Azam ODI flop).
పాక్ జట్టుకు సంబంధించి అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచిన బాబర్ ఆజామ్, గత కొద్ది కాలంగా వన్డేల్లో నిలకడ లేమితో బాధపడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ అదే పేలవ ఫామ్ కనబరుస్తున్నాడు. బాబర్ ఆజం చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయలేదు. బాబర్ ఒక్క సెంచరీ కూడా లేకుండా ఇప్పటివరకు 83 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు (Babar Azam Worst record).
ఇంతకు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఒక్క సెంచరీ చేయకుండా 83 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు (Babar vs Kohli). తాజాగా ఆ రికార్డ్‌ను బాబర్ ఆజామ్ సమం చేశాడు. ఆసియా బ్యాటర్ల విషయానికి వస్తే శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య ఒక్క సెంచరీ కూడా లేకుండా 88 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడి ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు. కాగా, బాబర్ ఆజామ్ చివరిసారిగా 2023 ఆసియా కప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.
ఇవి కూడా చదవండి
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి