Ashes Series 2025: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా జయభేరి..
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:22 AM
యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0 ఆధిక్యంతో పాటు సిరీస్‌నూ కైవసం చేసుకుంది ఆసీస్.
ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో అదరగొడుతోన్న ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది(Ashes Series 2025). అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆసీస్(Ausis Wins). ఫలితంగా.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0 ఆధిక్యంతో పాటు సిరీస్‌నూ కైవసం చేసుకుంది(Kangaroo Team Wins Ashes 2025). అలెక్స్ కేరీ(Alex Carey)కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ లభించింది.
కష్ట సాధ్యమైన 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్(England).. తమ రెండో ఇన్నింగ్స్‌లో 352 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (85), జేమీ స్మిత్(60), విల్‌జాక్స్ (47) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మన్ విఫలమవడంతో 82 పరుగులతో పరాజయం తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్ చెరో 3 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. బోలండ్ ఒక వికెట్ చేజిక్కించుకున్నాడు.
అంతకముందు.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు అలౌటైంది. ట్రావిస్ హెడ్(170) భారీ సెంచరీతో రాణించగా.. అలెక్స్ కేరీ(72) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు సాధించకపోవడంతో ఆశించిన దానికంటే తక్కువ స్కోరు చేయగలిగింది. ఇంగ్లంగ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్ 3 వికెట్లతో అలరించాడు. కెప్టెన్ స్టోక్స్, అర్చర్, విల్‌జాక్స్ తలో వికెట్ తీశారు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో అలెక్స్ కేరీ(106) సెంచరీ సాధించడంతో 371 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (82), మిచెల్ స్టార్క్ (54) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకే అలౌటైంది. ఆ టీమ్‌లో సారథి స్టోక్స్(83), పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అర్చర్ (51) హాఫ్ సెంచరీల సాయంతో పర్వాలేదనిపించే స్కోరు చేయగలిగింది.
ఇవీ చదవండి: