Share News

India vs Australia Women ODI: ఆసీస్‌దే తొలి వన్డే ముల్లన్‌పూర్‌

ABN , Publish Date - Sep 15 , 2025 | 04:21 AM

లిచ్‌ఫీల్డ్‌ (88), బెత్‌ మూనీ (77 నాటౌట్‌), అనాబెల్‌ సదర్లాండ్‌ (54 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో మెరిసిన వేళ భారత మహిళలతో మూడు వన్డేల సిరీ్‌సలో...

India vs Australia Women ODI: ఆసీస్‌దే తొలి వన్డే ముల్లన్‌పూర్‌

  • 8 వికెట్లతో భారత మహిళల ఓటమి

(న్యూ చండీగఢ్‌): లిచ్‌ఫీల్డ్‌ (88), బెత్‌ మూనీ (77 నాటౌట్‌), అనాబెల్‌ సదర్లాండ్‌ (54 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో మెరిసిన వేళ భారత మహిళలతో మూడు వన్డేల సిరీ్‌సలో ఆస్ట్రేలియా ఘనమైన బోణీ చేసింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది.. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 281/7 స్కోరుకు పరిమితమైంది. ప్రతికా రావల్‌ (64), మంధాన (58), హర్లీన్‌ (54) అర్ధ శతకాలు చేశారు. ఛేదనలో ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో 282/2 స్కోరు చేసి నెగ్గింది. రెండో వన్డే బుధవారం ఇక్కడే జరగనుంది.

సంక్షిప్తస్కోర్లు: భారత్‌ 50 ఓవర్లలో 281/7 (ప్రతికా రావల్‌ 64, స్మతి మంధాన 58, హర్లీన్‌ డియోల్‌ 54, మేఘన్‌ షూట్‌ 2/45, అలనా కింగ్‌ 1/28, సదర్లాండ్‌ 1/31, తహిలా మెక్‌గ్రాత్‌ 1/33); ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో 282/2 (లిచ్‌ఫీల్డ్‌ 88, బెత్‌ మూనీ 77 నాటౌట్‌, సదర్లాండ్‌ 54 నాటౌట్‌, పెర్రీ (33 రిటైర్డ్‌ హర్ట్‌) స్నేహ్‌ రాణా 1/51, క్రాంతి గౌడ్‌ 1/55)

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 04:21 AM