T20 Match Timings: ఆసియాకప్ సమయం మారింది
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:32 AM
యూఏఈలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆసియాకప్ టీ20 మ్యాచ్‌ల సమయాలను మార్చారు. సెప్టెంబరు 9 నుంచి టోర్నీ జరగనుండగా.. ఈ సమయంలో అక్కడ ఎండ వేడిమి 40 డిగ్రీల వరకు...
రాత్రి 8 నుంచి మ్యాచ్‌లు
దుబాయ్: యూఏఈలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆసియాకప్ టీ20 మ్యాచ్‌ల సమయాలను మార్చారు. సెప్టెంబరు 9 నుంచి టోర్నీ జరగనుండగా.. ఈ సమయంలో అక్కడ ఎండ వేడిమి 40 డిగ్రీల వరకు ఉండనుంది. రాత్రి ఏడు గంటల వరకు కూడా వేడి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆటగాళ్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమయం మార్చాల్సిందిగా ప్రసారకర్తలకు భారత్ సహా పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు విజ్ఞప్తి చేశాయి. దీంతో 18 మ్యాచ్‌లను అర్ధగంట వెనక్కి జరపగా, భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. అయితే ఒక్క మ్యాచ్ (అబుధాబిలో సెప్టెంబరు 15) మాత్రం సాయంత్రం 5.30కి మొదలు కానుంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి