Share News

Ashes 4th Test: తొలి రోజు ముగిసిన ఆట.. ఒక్కరోజే 20 వికెట్లు

ABN , Publish Date - Dec 26 , 2025 | 02:58 PM

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్లు స్వల్ప స్కోర్ కే కుప్పకూలాయి. తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. ఒక్కరోజే 20 వికెట్లు పడ్డాయి అంటే.. బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగారో అర్ధం చేసుకోవచ్చు.

Ashes 4th Test: తొలి రోజు ముగిసిన ఆట.. ఒక్కరోజే 20 వికెట్లు
Ashes 2025,

ఇంటర్నెట్ డెస్క్: యాషెస్‌ సిరీస్‌ 2025-26లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్లు స్వల్ప స్కోర్ కే కుప్పకూలాయి. తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. ఒక్కరోజే 20 వికెట్లు పడ్డాయి అంటే.. బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగారో అర్ధం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 152 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్ బౌలర్ జోష్ టంగ్ ఐదు వికెట్లు తీసి.. 21వ శతాబ్ధంలో ఫైఫర్ సాధించిన తొలి ఇంగ్లీష్ బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు.


ఇంగ్లాండ్‌ కూడా తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల వెనకంజలో ఉంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్‌ (41 పరుగులు) ఒక్కడే రాణించాడు. గస్‌ అట్కిన్సన్‌ (28 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. జో రూట్‌ (0), బెన్‌స్టోక్స్‌ (16), జెమ్మీ స్మిత్‌ సహా మిగతా వారంతా ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్‌ బౌలర్లలో మైఖేల్‌ నెసర్‌ 4 వికెట్లు తీశాడు. అలానే స్కాట్‌ బోల్యాండ్‌ 3, మిచెల్‌ స్టార్క్‌ 2, కామెరూన్‌ గ్రీన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సే ఘోరంగా సాగిందంటే.. ఇంగ్లాండ్ ది అంతకంటే దారుణంగా జరిగింది. ఇరుజట్లలో ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేదు. ఇక రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌.. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఒక ఓవర్‌కు వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (0*), స్కాట్‌ బోల్యాండ్‌ (4*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.



ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్

Updated Date - Dec 26 , 2025 | 02:58 PM