Team India sponsor: టీమిండియాకు నూతన స్పాన్సర్ ఖరారు..
ABN , Publish Date - Sep 16 , 2025 | 04:04 PM
భారత క్రికెట్ జట్టుకు నూతన స్పాన్సర్ ఖరారు అయింది. టీమిండియా కొత్త స్పాన్సర్‌గా అపోలో టైర్స్ నిలిచింది. ఇప్పటివరకు డ్రీమ్ లెవన్ టీమిండియా స్పాన్సర్‌గా వ్యవహరించింది.
భారత క్రికెట్ జట్టుకు నూతన స్పాన్సర్ ఖరారు అయింది. టీమిండియా కొత్త స్పాన్సర్‌గా అపోలో టైర్స్ (Apollo Tyres) నిలిచింది. ఇప్పటివరకు డ్రీమ్ లెవన్ టీమిండియా స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత డ్రీమ్ లెవెన్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో బీసీసీఐ కొత్త్ స్పాన్సర్ కోసం అన్వేషణ సాగించింది (Team India sponsor).
ప్రస్తుతం టీమిండియా స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్‌లో ఆడుతోంది (Indian cricket jersey sponsor). కాగా, తాజా డీల్‌లో భాగంగా టీమిండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు అపోలో టైర్స్ రూ.4.5 కోట్లను బీసీసీఐకు చెల్లించబోతోంది. ఇంతకు ముందు స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ లెవెన్ ఒక్కో మ్యాచ్‌కు రూ.4 కోట్లు చెల్లించేది. 2027 వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ హక్కులను అపోలో టైర్స్ దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ మ్యాచ్ రెఫరీని తప్పించాలంటున్న పీసీబీ.. ఐసీసీ తిరస్కరించే ఛాన్స్
పాక్ క్రీడాకారులతో మాట కలపని భారత ప్లేయర్లు.. సైలెంట్ బాయ్‌కాట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి