Aman Sehrawat Disqualification: బరువు ఎక్కువై అనర్హతకు గురై
ABN , Publish Date - Sep 15 , 2025 | 04:18 AM
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో ఆదివారం భారత్‌కు నిరాశే ఎదురైంది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (57 కిలోలు) అనూహ్యంగా...
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ నుంచి అమన్ అవుట్
జాగ్రెబ్ (క్రొయేషియా): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో ఆదివారం భారత్‌కు నిరాశే ఎదురైంది. కచ్చితంగా పతకం సాధిస్తాడనుకున్న పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (57 కిలోలు) అనూహ్యంగా తన పోటీకి ముందే అనర్హతకు గురవడం గమనార్హం. ఆదివారం పోటీకి ముందు రెజ్లర్ల బరువు తూచే క్రమంలో అమన్ నిర్ణీత బరువు కన్నా 1.7 కిలోలు అధికంగా ఉన్నట్టు నిర్వాహకులు గుర్తించారు. దీంతో నిబంధనల ప్రకారం అమన్‌పై టోర్నీలో పాల్గొనకుండా అనర్హత విధించారు. ఫలితంగా ఒక్క బౌట్ కూడా ఆడకుండానే అమన్ నిరాశగా వెనుదిరిగాడు. ఇక.. మిగతా భారత రెజ్లర్లలో దీపక్ పూనియా (92 కిలోలు) తొలి రౌండ్ గెలిచినా, రెండో రౌండ్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. వికాస్ సింగ్ (74 కి), అమిత్ (79 కి) ఆరంభ బౌట్లలోనే పరాజయం పాలయ్యారు. తొలి రౌండ్లో ఓడిన ముకుల్ దహియా (86 కిలోలు).. ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో దక్కిన రెపిచేజ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను రెపిచేజ్‌లో గెలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి