Share News

Viral Video: నీటిలో జీబ్రా.. రౌండప్ చేసిన మొసళ్లు.. తర్వాత ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Jan 10 , 2025 | 09:23 PM

అంత పెద్ద ఏనుగు కూడా నీటిలోని మొసలి ముందు బలహీనపడిపోతుంది. ఇక, మామూలు ప్రాణుల సంగతి చెప్పనక్కర్లేదు. అలాంటిది ఓ జంతువును నీటిలో పలు మొసళ్లు రౌండప్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. బతికి బయటపడడం అసాధ్యం. ఒకవేళ బతికితే మాత్రం అది అద్భుతమనే చెప్పాలి.

Viral Video: నీటిలో జీబ్రా.. రౌండప్ చేసిన మొసళ్లు.. తర్వాత ఏం జరిగిందో చూడండి..
Zebra surrounded by crocodiles in the river

నీటిలోని మొసలి (Crocodile) చేతికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అంత పెద్ద ఏనుగు (Elephant) కూడా నీటిలోని మొసలి ముందు బలహీనపడిపోతుంది. ఇక, మామూలు ప్రాణుల సంగతి చెప్పనక్కర్లేదు. అలాంటిది ఓ జంతువును నీటిలో పలు మొసళ్లు రౌండప్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. బతికి బయటపడడం అసాధ్యం. ఒకవేళ బతికితే మాత్రం అది అద్భుతమనే చెప్పాలి. తాజాగా ఓ జీబ్రా (Zebra)కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సమయంలో జీబ్రా తప్పించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. జీబ్రా ఓ నదిలోకి దిగింది. అయితే అప్పటికే ఓ మొసలి ఆ జీబ్రాను సమీపించి దాడికి దిగింది. తన దవడతో జీబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆ జీబ్రా ధైర్యం కోల్పోకుండా ఆ మొసలితో పోరాడింది. తన పళ్లతో మొసలిని దవడను కొరికేసింది. ఆ సమయంలో మరికొన్ని మొసళ్లు అక్కడకు వచ్చి జీబ్రాను చుట్టు ముట్టాయి. అయినా జీబ్రా తనను తాను కాపాడుకుంటూ మొసళ్లపై ఎదురు దాడికి దిగింది. వాటిని ఎదిరిస్తూనే మెల్లిగా ఒడ్డుకు చేరుకుంది.


ఆ జీబ్రా పోరాటాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 1.4 కోట్ల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. 14 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ప్రశాంతంగా కనిపించే జీబ్రా నిజానికి చాలా బలమైనది``, ``జీబ్రా చివరి వరకు పోరాడి తన ప్రాణాలను దక్కించుకుంది``, ``అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పోరాడే వాడే విజేతగా నిలుస్తాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Electricity Bill: కరెంట్ బిల్లు చూసి షాక్.. ఏకంగా రూ.200 కోట్లు రావడంతో యజమాని పరిస్థితి ఏంటంటే..


Artificial Intelligence: ఏఐ ఏం చేయగలదో చూడండి.. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే..


Viral Video: ఏనుగును చూసి కుక్క మొరిగితే ఏమవుతుంది? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..


Starbucks: స్టార్‌బక్స్ లోగో ఏంటో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 10 , 2025 | 09:23 PM