Erdogan Advises Meloni: సిగరెట్ మానేయ్.. మెలనీకి సలహా ఇచ్చిన టర్కీ ప్రెసిడెంట్..
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:28 PM
ఈజిప్ట్‌లో జరిగిన పీస్ సమిట్‌లో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో టర్కీ ప్రెసిడెంట్ టాయిప్ ఎర్డొగాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెలనీ, ఎర్డొగాన్ ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలనీ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోతున్నారు. ఇప్పుడు కూడా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రధాని మెలనీ నిన్న (సోమవారం) ఈజిప్ట్‌లో జరిగిన పీస్ సమిట్‌లో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో టర్కీ ప్రెసిడెంట్ టాయిప్ ఎర్డొగాన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెలనీ, ఎర్డొగాన్ ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఎర్డొగాన్ మాట్లాడుతూ..‘మీరు చాలా అందంగా ఉన్నారు. సిగరెట్ తాగటం ఆపేయవచ్చుగా’ అని సలహా ఇచ్చారు. దీంతో పక్కనే ఉన్న ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చిన్నగా నవ్వారు. ఎర్డొగాన్ ఇచ్చిన సలహాతో మెలనీ కాస్త ఇబ్బందిపడుతున్నట్లుగా అనిపించారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మెలనీ సిగరెట్ తాగుతుందా? నాకు ఇప్పుడే తెలిసింది’..
‘మెలనీ సిగరెట్ తాగుతుందని కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ ముసలాయన ప్రపంచం మొత్తానికి చెప్పేశాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, టర్కీ పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. దేశంలో పొగాకును నిషేదించింది. పొగాకు వ్యతిరేకంగా మీడియా ప్రచారాలు, ఆరోగ్య కార్యక్రమాలు చేస్తోంది. అందుకే ఎర్డొగాన్, మెలనీతో పొగాకు గురించి మాట్లాడారు. మానేయమని సలహా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
సునీతను అడ్డుకోండి.. వైరల్‌గా మారిన పొన్నం వీడియో..
పేదవాడి ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం: ఎంపీ కేశినేని