Ponnam Prabhakars Shocking Comments: సునీతను అడ్డుకోండి.. వైరల్‌గా మారిన పొన్నం వీడియో..
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:40 PM
సునీత కన్నీళ్లు పెట్టుకోవటంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వేదికల మీద, రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసుకుంటున్నారు. తాజాగా, రహమత్ నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను తల్చుకుని ఆయన సతీమణి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు.
సునీత కన్నీళ్లు పెట్టుకోవటంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..‘వేదికల మీద, రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్, హరీశ్‌రావు డ్రామాలు ఆడుతున్నారు. సునీతను ఓదారుస్తున్నట్లు నటిస్తున్నారు. రాజకీయాల కోసం సునీతమ్మను ఇబ్బందిపెట్టడం భావ్యం కాదు. బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ఎలాంటి అభివృద్ధి చెందలేదు’ అని అన్నారు.
వైరల్‌గా మారిన వీడియో..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాగంటి సునీత గురించి మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయ రెడ్డితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆ వీడియోలో పొన్నం.. ‘కన్నీళ్లు పెట్టుకుంటూ క్యాంపైన్ చేస్తుంది. ఏదో ఒకటి చేసి అడ్డుకోండి. లేదంటే ఇబ్బంది ఐతది’ అని అన్నట్లుగా ఉంది.
ఇవి కూడా చదవండి
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత.. ఆ కొద్ది సేపటికే..
రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం: హోంమంత్రి అనిత