Indian innovation: ఈ బైక్ చోరీ చేయాలంటే దొంగలకు చుక్కలు కనబడతాయి.. ఈ ట్రిక్ చూస్తే..
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:49 AM
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ బైక్ దొంగతనాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. దొంగలు కొత్త కొత్త టెక్నిక్‌లు ఉపయోగించి బైక్‌లను చోరీ చేస్తున్నారు. అయితే దొంగలకే షాకిచ్చేలా ఒక వ్యక్తి వెరైటీగా బైక్‌కు తాళం వేశాడు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (unbelievable jugaad).
@i_am_Aawez అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ బైక్ దొంగతనాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. దొంగలు కొత్త కొత్త టెక్నిక్‌లు ఉపయోగించి బైక్‌లను చోరీ చేస్తున్నారు. అయితే దొంగలకే షాకిచ్చేలా ఒక వ్యక్తి వెరైటీగా బైక్‌కు తాళం వేశాడు. ఆ వ్యక్తి ముందుగా బైక్ యాక్సిలరేటర్‌కు డ్రిల్‌తో రంధ్రం చేశాడు. రంధ్రం చేసిన తర్వాత దానిలోకి ప్యాడ్‌లాక్‌ను పెట్టి లాక్ చేశాడు. ఇలా చేయడం ద్వారా యాక్సిలరేటర్ పూర్తిగా లాక్ అయిపోయింది (creative hack).
ఈ ట్రిక్ బైక్ చోరీలను ఏ స్థాయిలో అరికడుతుందో తెలియదు కానీ, వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది (desi jugaad). ఇప్పటివరకు ఈ వీడియోను 1.7 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ జుగాడ్ భారతదేశం నుంచి బయటకు వెళ్లకూడదు అని ఒకరు కామెంట్ చేశారు. ఇలా ఆలోచించేవారు భారతీయులే అయి ఉంటారని మరొకరు సరదాగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. ఈమె ఏం చేసిందంటే..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..