Indian woman jugaad: వామ్మో.. వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. ఈమె ఏం చేసిందంటే..
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:02 AM
సాధారణంగా చాలా మంది ఇళ్లలో వాషింగ్ మెషిన్ ఉంటుంది. దానిని అందరూ బట్టల ఉతకడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ వాషింగ్ మెషిన్‌ను వెరైటీగా ఉపయోగించింది.
మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. శ్రమతో కూడుకున్న పనులను సులభంగా పూర్తి చేసి ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Indian creativity).
adityasaloni2015 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాధారణంగా చాలా మంది ఇళ్లలో వాషింగ్ మెషిన్ ఉంటుంది. దానిని అందరూ బట్టల ఉతకడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ వాషింగ్ మెషిన్‌ను వెరైటీగా ఉపయోగించింది. ఒక మహిళ కాస్త వెరైటీగా ఆలోచించి వాషింగ్ మెషిన్‌ను గోధుమలను ఆరబెట్టడానికి ఉపయోగించింది. ఆమె గోధుమలను ఒక వస్త్రంలో వేసి దానిని వాషింగ్ మెషిన్‌లో ఉంచి డ్రై చేసింది (amazing hack).
వాషింగ్ మెషిన్ ద్వారా గోధుమలను డ్రై చేయవచ్చనే ఆలోచన చాలా మందిని ఆకట్టుకుంటోంది (Indian women innovation). ఈ ట్రిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 8 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. రోటీ తిన్నప్పుడు సర్ఫ్ ఎక్సెల్ వాసన వస్తుందేమో అని ఒకరు కామెంట్ చేశారు. వాషింగ్ మెషిన్ శక్తులు దుర్వినియోగం అవుతున్నాయని ఒకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..