Xiao He Humanoid Robot: మోదీ చైనా పర్యటన.. ప్రత్యేక ఆకర్షణగా హ్యూమనాయిడ్ రోబోట్..
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:22 PM
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో ఓ హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తోంది. ఆ రోబోట్ పేరు ‘క్షివావ్ హ’. ఈ రోబోట్ సమిట్‌కు వచ్చే వారికి పలు రకాల భాషల్లో సాయం చేయనుంది. అవసరమైన సమాచారాన్ని అందివ్వనుంది.
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమిట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి జరగబోయే ఎస్‌సీఓ సమిట్‌కు టియాన్‌జిన్ పట్టణం వేదిక కానుంది. ఆగస్టు 31నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం 20 దేశాలు ఈ సమిట్‌లో పాల్గొననున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆయన చైనా బయలుదేరి వెళ్లారు. ఈ సమిట్‌లో ఓ హ్యూమనాయిడ్ రోబోట్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తోంది.
ఆ రోబోట్ పేరు ‘క్షివావ్ హ’. ఈ రోబోట్ సమిట్‌కు వచ్చే వారికి పలు రకాల భాషల్లో సాయం చేయనుంది. అవసరమైన సమాచారాన్ని అందివ్వనుంది. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు వారు అడిగిన భాషలో సమాధానం ఇవ్వనుంది. కేవలం ఈ సమిట్ కోసమే దాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. భారత మీడియా ఏఎన్ఐ క్షివావ్ హను ఇంటర్వ్యూ చేయగా ఎంతో చక్కగా మనిషిలాగా సమాధానాలు చెప్పింది. ఆ రోబోట్ మనిషిలాగా కళ్లు ఆర్పటం, చేతులు అటు, ఇటు తిప్పటం చేస్తూ సమాధానాలు చెబుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎస్‌సీఓ సమిట్ చరిత్ర ఇది..
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో ఏర్పాటైంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రీజనల్ ఆర్గనైజేషన్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇందులో చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్, కజికిస్తాన్, కైర్గిస్తాన్, తజికిస్తాన్, ఉబ్జకిస్తాన్, ఇరాన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. బెలారస్, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా దేశాలు సభ్యదేశాలు కాకపోయినా.. ఎస్‌సీఓ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాతో చైనా, భారత్‌ల స్నేహం చెడింది. భారీ టారిఫ్‌లతో రెండు దేశాలను ఇబ్బందుల్లో పడేశారు. ఇలాంటి సమయంలో చైనాలో జరగబోయే ఈ సమిట్ ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
భర్తలోని ఈ 5 లక్షణాలే కాపురాలను కూలుస్తాయ్..!
తీవ్ర విషాదం.. గుండె పోటుతో ఆస్పత్రిలోనే ప్రాణం విడిచిన గుండె డాక్టర్..