Woman Swaps Real Gold: దొంగతనం చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు..
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:44 PM
చీర కట్టుకున్న మహిళ క్షణాల్లో ఓ కమ్మకు సంబంధించిన కొంత భాగాన్ని దొంగిలించింది. తనతో పాటు వచ్చిన ఆమెకు ఇచ్చింది. మిగిలిన భాగాన్ని అక్కడే పెట్టేసింది. ఇతర కస్టమర్ల బిజీలో సిబ్బంది ఆ దొంగతనాన్ని గుర్తించలేకపోయారు.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వాడకం బాగా పెరిగిపోయింది. ఎక్కడో అమెరికాలో జరిగే సంఘటనల్ని ఇంట్లో కూర్చుని మొబైల్‌లో చూడగలుగుతున్నాం. ఏదైనా నేరం జరిగితే టెక్నాలజీ పుణ్యమా అని నేరస్తుల్ని గంటల్లోనే పట్టుకోవటం సాధ్యపడుతోంది. ఇందులో సీసీటీవీ కెమెరాలు(Jewellery Store CCTV Theft) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే కిల్లీ షాపుల వాళ్లు కూడా సీసీటీవీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అలాంటిది బంగారం అమ్మే షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండకుండా ఉంటాయా చెప్పండి. నగల షాపులో సీసీటీవీ కెమెరాలు ఉంటాయని కనీస అవగాహన లేని ఇద్దరు మహిళలు ఎంతో చాకచక్యంగా దొంగతనం చేశారు.
సీసీటీవీ కెమెరాల పుణ్యమా అని వారి గుట్టు రట్టయింది. వారు చేసిన దొంగతనం గురించి ప్రపంచమంతా తెలిసి పోయింది. ఇంతకీ సంగతేంటంటే.. ఢిల్లీకి చెందిన ఇద్దరు మహిళలు లక్ష్మీ నగర్‌లోని బంగారు నగల షాపు(Jewellery Shop Security)లోకి వెళ్లారు. కమ్మలు చూపించని అడిగారు. షాపులోని మహిళా సిబ్బంది వారి ముందు ఓ బాక్స్ పెట్టింది. చీర కట్టుకున్న మహిళ క్షణాల్లో ఓ కమ్మకు సంబంధించిన కొంత భాగాన్ని దొంగిలించింది. తనతో పాటు వచ్చిన ఆమెకు ఇచ్చింది. మిగిలిన భాగాన్ని అక్కడే పెట్టేసింది. ఇతర కస్టమర్ల బిజీలో సిబ్బంది ఆ దొంగతనాన్ని గుర్తించలేకపోయింది.
కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరు దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. షాపు యజమాని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. అతడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇద్దరు మహిళా దొంగల(Jewellery Shop Theft) కోసం అన్వేషిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ దొంగలు మరీ అమాయకంగా ఉన్నారు. బంగారు షాపులో సీసీటీవీ కెమెరాలు ఉంటాయని కనీస అవగాహన కూడా లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ట్రెండింగ్: లవర్స్, పేరెంట్స్ కమిట్‌మెంట్‌ను లేడీస్ ఇలా చెక్ చేస్తున్నారు
బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది.. కవిత ఎమోషనల్