Share News

Ola: వీధి కుక్కలంటే భయం.. ఈ మహిళ ఏం చేసిందో తెలిస్తే..

ABN , Publish Date - Jun 05 , 2025 | 10:36 PM

వీధి కుక్కలకు భయపడిన ఓ మహిళా ఓలా బైక్ బుక్ చేసుకుని తన గమ్యస్థానానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Ola: వీధి కుక్కలంటే భయం.. ఈ మహిళ ఏం చేసిందో తెలిస్తే..
Ola bike viral video

ఇంటర్నెట్ డెస్క్: వీధి కుక్కలంటే భయపడని వారు ఉండరు. ప్రతి సందులో కనిపించే ఈ వీధి కుక్కలు కొత్త వారినే కాకుండా అప్పుడప్పుడూ పాత వారిని కూడా టార్గెట్ చేస్తుంటాయి. ఇలా వీధి కుక్కల బెడద తట్టుకోలేకపోయిన ఓ మహిళ తాజాగా ఓలా బైక్ బుక్ చేసింది. విషయం తెలిశాక బైక్ డ్రైవర్ కూడా షాకైపోయాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

@rohitvlogster అనే యూజర్ సోషల్ మీడియాలో ఈ ఉదంతాన్ని షేర్ చేశాడు. రైడ్ బుక్ కాగానే తొలుత ఓ బైక్ డ్రైవర్ అక్కడికి చేరుకున్నాడు. ఆ తరువాత రైడ్ ప్రారంభించేందుకు ఓటీపీ ఎంటర్ చేశాడు. అయితే, మహిళ దిగాల్సిన చోటు అక్కడికి కేవలం 180 మీటర్ల దూరంలో ఉందని తెలియడంతో అతడు షాకైపోయాడు. మీరు వెళ్లాల్సిన ప్రాంతాన్ని సరిగ్గానే ఎంచుకున్నారా అని ప్రశ్నించాడు. తను పెట్టిన అడ్రస్ కరక్టేనని మహిళ తెలిపింది. తను వెళ్లే మార్గంలో కుక్కలు ఉంటాయనే భయంతో నడిచి వెళ్లకుండా బైక్‌పై వెళ్లాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అతడు ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తూ మహిళను అక్కడ దిగబెట్టాడు.


కాగా, ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మహిళ చేసిన పనికి అంతా నవ్వుకున్నారు. స్మైలీ ఎమోజీలు నెట్టింట షేర్ చేశారు. కొందరు మాత్రం ఈ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, గతేడాది మరో ఓలా డ్రైవర్ కూడా ఇలాగే వైరల్ అయ్యాడు. తాను గతంలో ఒలింపిక్స్‌లో దేశం తరపున పాల్గొన్నానని చెప్పడంతో అనేక మంది ఆశ్చర్యపోయారు. ఆయన వివిధ పోటీల్లో బంగారు, వెండి పతకాలు గెలిచినట్టు తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ నిధుల అండతో ఓలా కొన్నేళ్లక్రితం పలు దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. అయితే, ఇకపై ఇండియా కార్యకలాపాలపైనే దృష్టిపెడతామని గతేడాది ఏప్రిల్‌లో పేర్కొంది. గతేడాది ఆగస్టులో సంస్థ తన పేరును ఓలా నుంచి ఓలా కన్జ్యూమర్‌గా మార్చుకుంది.

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..

ఆసుపత్రిలో ఉన్న ఉద్యోగిపై బాస్ శాడిజం.. చివరకు

Read Latest and Viral News

Updated Date - Jun 06 , 2025 | 12:06 AM