Share News

Toxic Work Culture: ఆసుపత్రిలో ఉన్న ఉద్యోగిపై బాస్ శాడిజం.. చివరకు

ABN , Publish Date - Jun 05 , 2025 | 07:43 PM

కాలు విరిగి ఆసుపత్రి పాలైన ఓ ఉద్యోగిని ఆఫీసుకు రమ్మంటూ బలవంతం చేసిన ఓ బాస్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Toxic Work Culture: ఆసుపత్రిలో ఉన్న ఉద్యోగిపై బాస్ శాడిజం.. చివరకు
toxic work culture

ఇంటర్నెట్ డెస్క్: అతడో కంపెనీలో పని చేస్తున్నాడు. కాలు విరిగి ఆసుపత్రి పాలయ్యాడు. విషయం తన బాస్‌కు చెప్పాడు. కానీ బాస్ ఇచ్చిన రిప్లై చూసి తట్టుకోలేకపోయిన అతడు మరో ఆలోచన లేకుండా రాజీనామా చేశాడు. ఈ మధ్య కాలంలో ఉద్యోగులు కార్యాలయాల్లో ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారో కళ్లకు కట్టినట్టు చూపించే ఘటన ఇది. ఇలాంటి విషయాలను నెట్టింట పంచుకుంటూ జనాలకు అవగాహన కల్పించే బెన్ ఆస్కిన్స్ అనే వ్యక్తి ఈ ఉదంతాన్ని షేర్ చేశాడు.

సంస్థలో ఓ ఉన్నతాధికారికి, బాధిత ఉద్యోగికి జరిగిన వాట్సాప్ సంభాషణను ఆయన నెట్టింట పంచుకున్నారు. తొలుత బాస్ సదరు ఉద్యోగిని ఎక్కడున్నావని అడిగారు. తన కాలు విరిగిందని ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నానని అతడు బదులిచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఎవరైనా మాటసాయమో లేదా ఆర్థిక సాయమో చేస్తారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తారు. ఇందుకు విరుద్ధంగా ఆ బాస్ మాత్రం ఉద్యోగిపై తన శాడిజాన్ని ప్రదర్శించారు. శుక్రవారం నాటి షిఫ్ట్‌కు అతడు అందుబాటులో ఉండాలని తేల్చి చెప్పారు. అయితే, బాధిత ఉద్యోగి మాత్రం తన అశక్తతను తెలియజేశాడు. కొన్ని రోజులు రెస్టు తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిపాడు. ఇంత వివరంగా ఉద్యోగి చెబుతున్నా బాస్ మాత్రం కనికరం చూపలేదు. ఆఫీసుకు రావాలని బలవంతం చేసే ప్రయత్నం చేశాడు.


కానీ ఉద్యోగి మాత్రం సహనం కోల్పోకుండా బాస్‌కు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. డాక్టర్లు అనుమతించిన వెంటనే వచ్చేస్తానని మరీ మరీ చెప్పాడు. కానీ బాస్ ఇవేమీ పట్టించుకోకుండా.. ‘నీ కోసం కావాలంటే ఓ మంచి కుర్చీని కూడా అరెంజ్ చేస్తా.. వచ్చేయి’ అని అన్నారు. కానీ ఉద్యోగి మాత్రం కుదరదని స్పష్టం చేశాడు. అయినా వెనక్కు తగ్గని బాస్ అతడిని అపరాధ భావంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఉద్యోగంలో చేరి రెండు వారాలు కూడా కాకముందే ఇలా చేస్తే బాగుండదేమో అంటూ అతడిని ఆఫీసుకు రప్పించే ప్రయత్నం చేశాడు.


చివరకు విసిగిపోయిన ఉద్యోగి నేను రాజీనామా చేస్తున్నా అంటూ సంభాషణను అక్కడితో ముగించాడు. దీనిపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. తాము ఇలాంటివి అనేకం ఎదుర్కొన్నామని చెప్పారు. ఆత్మాభిమానం కంటే ఉద్యోగం పెద్ద గొప్పదేమీ కాదని అన్నారు. బాస్‌కు షాకిస్తూ రాజీనామా చేసినందుకు ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి:

ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్

ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Jun 05 , 2025 | 07:51 PM