Man Seeking Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. మొదటి భార్య, పిల్లలు కలిసి..
ABN , Publish Date - Dec 24 , 2025 | 03:05 PM
రెండో పెళ్లి చేసుకోవటతానికి సిద్ధమైన ఓ వ్యక్తితో అతడి మొదటి భార్య, పిల్లలు దాడి చేశారు. కోర్టులోని అతడిని అతడికి కాబోయే రెండో భార్యని దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కుటుంబ కలహాల కారణంగా ఆ భార్యాభర్తలు విడిపోయారు. భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. రెండో పెళ్లి చేసుకోవడానికి పర్మీషన్ కోసం కాబోయే భార్యతో కలిసి కోర్టుకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య, పిల్లలు కోర్టు దగ్గరకు చేరుకున్నారు. వారందరూ కలిసి ఆ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అతడికి కాబోయే భార్యను కూడా కొట్టారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కనౌజ్ మిర్జి ప్రాంతానికి చెందిన సంజు సింగ్‌కు పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పెళ్లయింది.
ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొన్నేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే, విడాకులు ఇవ్వటం సంజు భార్యకు ఏమాత్రం ఇష్టం లేదు. భర్త బలవంతం చేయటంతో మనసు చంపుకుని విడాకులు ఇచ్చింది. విడాకులు ఇచ్చిన తర్వాత సంజు రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. తాజాగా, తనకు కాబోయే భార్యతో కలిసి రెండో పెళ్లికి పర్మీషన్ తీసుకోవటానికి ఏడీఎమ్ కోర్టుకు వెళ్లాడు. ఈ విషయం సంజు మొదటి భార్య, పిల్లలకు తెలిసింది. వారితో పాటు మరికొంతమంది కోర్టుకు దగ్గరకు వచ్చారు.
సంజుతో గొడవ పెట్టుకున్నారు. సంజును, సంజుకు కాబోయే రెండో భార్యను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ గొడవతో ఏడీఎమ్ కోర్టు యుద్ధ భూమిలా మారిపోయింది. కొన్ని నిమిషాల పాటు గొడవ సాగింది. కోర్టులోని వారు గొడవను ఆపారు. తర్వాత గొడవపడ్డ వారందరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పాపం ఆ రెండో భార్య ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది. ఆమెను బాగా కొట్టారు’..‘ఫ్యామిలీ డ్రామా ఫైట్లు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మియాపూర్ పోలీస్ స్టేషన పరిధిలో దారుణం..
రికార్డులే రికార్డులు.. వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టిన ఇషాన్ కిషన్