Share News

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుకోమంటూ మహిళకు బంపరాఫర్.. అతడి కండీషన్ తెలుసుకుని ఏం చేసిందంటే..

ABN , Publish Date - Apr 23 , 2025 | 08:05 PM

మహిళకు ఇటీవల వింత అనుభవం ఎదురైంది. లింక్డ్ఇన్‌లో (LinkedIn) ఆమెకు ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ పంపించాడు. అయితే ఓ కండీషన్ కూడా పెట్టాడు. పది సెకన్ల పాటు క్రెడిట్ కార్డును వాడుకోమంటూ ఆఫర్ ఇచ్చాడు. దీంతో చివరకు ఆమె ఏం చేసిందంటే..

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుకోమంటూ మహిళకు బంపరాఫర్.. అతడి కండీషన్ తెలుసుకుని  ఏం చేసిందంటే..

మహిళలకు నిత్యం అనేక రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. వారిని కొందరు తమదారిలోకి తెచ్చుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మహిళలు ఏవేవో ఆశ చూపిస్తుంటారు. మరికొందరు మహిళ తెలివికి పరీక్ష పెడుతూ చిత్రవిచిత్ర నిబంధనలు పెడుతుంటారు. తాజాగా, ఓ మహిళకు ఇలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెకు లింక్డ్ఇన్‌లో క్రెడిట్ కార్డ్ పంపించాడు. 10 సెకన్ల పాటు వాడుకోమంటూ బంపరాఫర్ ఇచ్చాడు. దీంతో చివరకు ఆమె ఇచ్చిన రిప్లై తెలుసుకుని అంతా అభినందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ అయిన హర్నూర్ సలుజా అనే మహిళకు ఇటీవల వింత అనుభవం ఎదురైంది. లింక్డ్ఇన్‌లో (LinkedIn) ఆమెకు ఓ వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ (Credit Card) పంపించాడు. అయితే ఓ కండీషన్ కూడా పెట్టాడు. ‘‘నేను మీకు నా క్రెడిట్ కార్డును కేవలం 10 సెకన్ల పాటు పంపుతున్నాను. ఈలోగా దీన్ని మీరు లోడ్ చేయగలిగితే షాపింగ్ చేసుకోవచ్చు’’.. అని సందేశం రాశాడు. ఆ మెసేజ్ చూడగానే ఆమె అవాక్కైంది.

Viral Video: మంచి పని చేస్తే.. అంతా మంచే జరుగుతుంది.. ఇతడికేమైందో చూడండి..


తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంంది. ఆ వ్యక్తి అన్న మాటలను గుర్తు చేస్తూ.. అతడికి తాను ఎలా కనిపిస్తున్నానంటూ మండిపడింది. అతను తన ఇంటర్నెట్ స్పీడ్‌ను టెస్ట్ చేయాలని అనుకున్నాడో, లేక తన క్యారెక్టర్‌ను అంచనా వేయాలని అనుకున్నాడో.. లేక తన స్కిల్స్‌ను పరిశీలించాలని అనుకున్నాడో అర్థం కాలేదని చెప్పింది. అతడి ఉద్దేశం ఏదైనా తనకు ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. తన ఇంటర్నెట్ వేగంగా ఉండడంతో పాటూ తన నైతికత కూడా వేగంగా ఉందంటూ అతడికి బదులు ఇచ్చింది.

Funny Viral Video: మీ వీధులు సల్లగుండ.. ఎండ వేడి తగలకుండా వీళ్లు చేసిన పని చూడండి..


కాగా, అపరిచిత వ్యక్తికి ఆమె ఇచ్చిన రిప్లై చూసి అంతా అభినందిస్తున్నారు. అలాగే వారికి ఎదురైన విచిత్ర అనుభవాలను కూడా గుర్తు చేసుకున్నారు. ఓ మహిళ కామెంట్ చేస్తూ.. తనకూ ఓ వ్యక్తి ఇలా డబ్బు ఆశ చూపాడని, తాను రెండు సార్లు మర్యాదగా తిరస్కరించానని, అయినా అతను పదే పదే అలాగే చేస్తుండడంతో వెంటనే బ్లాక్ చేశానని చెప్పింది. అలాగే మరో వ్యక్తి తన ఎదురైన వింత అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అతడి చిన్నతనంలో ఓ వ్యక్తి ఈమెయిల్‌లో మెసేజ్‌లు చేసేవాడని చెప్పాడు. అతన్ని మహిళ అనుకుని పేపాల్ ద్వారా 100 పౌండ్లు కూడా పంపించాడని కూడా చెప్పాడు. ఇలా చాలా మంది తమకు ఎదురైన వింత వింత అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుకున్నారు. మొత్తానికి ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Hippopotamus VS Crocodile: నీటి ఏనుగు పవర్ మామూలుగా లేదుగా.. మొసలిని ఎలా భయపెట్టిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2025 | 08:12 PM