Share News

Snake Acting Video: వావ్.. ఈ పాముకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే.. ఎలా నటిస్తోందో చూడండి..

ABN , Publish Date - Jul 28 , 2025 | 07:58 PM

చాలా కొద్ది మంది మాత్రమే పాములను పెంచకుంటారు. స్వభావ రీత్యా పాములు ఏ ఇతర జీవులతోనూ సఖ్యతగా ఉండలేవు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Snake Acting Video: వావ్.. ఈ పాముకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే.. ఎలా నటిస్తోందో చూడండి..
snake became a drama queen

సాధారణంగా చాలా మంది కుక్కలు, పిల్లులు, చిలుకలను పెంచుకుంటారు (Pet Animlas). అవి కూడా మనుషులతో సఖ్యంగా మెలుగుతాయి. మనుషులు చెప్పే కొన్ని విషయాలను బాగా అర్థం చేసుకుని అందుకు తగినట్టుగా ప్రవర్తిస్తాయి. అయితే చాలా కొద్ది మంది మాత్రమే పాములను (Snake) పెంచకుంటారు. స్వభావ రీత్యా పాములు ఏ ఇతర జీవులతోనూ సఖ్యతగా ఉండలేవు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే (Pet Snake).


pubity అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పెంపుడు పాము తన యజమాని చెప్పినట్టు నటిస్తోంది. యజమాని తాకిన వెంటనే ఆ పాము వెనక్కి తిరిగి చనిపోయినట్టు నటిస్తోంది. ఒక పాము అలా చేయడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. పాముకు అలాంటి శిక్షణ ఇవ్వడం చాలా గొప్ప విషయం అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఆ పాముకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ పాము నిజమైన డ్రామా క్వీన్ అని ఒకరు కామెంట్ చేశారు. సాధారణంగా పాములకు అలా శిక్షణ ఇవ్వడం చాలా కష్టమని మరొకరు కామెంట్ చేశారు. పాములు కూడా ఇలా చేయగలవని తనకు ఇప్పుడే తెలిసిందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..

ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 07:58 PM