Python Bites A Man: కొండచిలువకు ముద్దు.. చివరకు ఆ వ్యక్తికి ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:26 PM
వన్య ప్రాణులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాధారణంగా ఏ జంతువైనా అనవసరంగా ఇతరులకు హాని కలిగించవు. తమకు ఆకలి వేసినపుడు లేదా తమ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని భయం వేసినపుడే క్రూర మృగాలు కూడా దాడికి దిగుతాయి.
వన్య ప్రాణులకు (Wild Animals) ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాధారణంగా ఏ జంతువైనా అనవసరంగా ఇతరులకు హాని కలిగించవు. తమకు ఆకలి వేసినపుడు లేదా తమ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని భయం వేసినపుడే క్రూర మృగాలు కూడా దాడికి దిగుతాయి. అలాంటిది కావాలని వాటితో ఆటలాడుకోవాలనుకుంటే మాత్రం ప్రమదాన్ని పిలిచి ఆహ్వాంచడమే అవుతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి వీడియోలు ఎన్న మన కళ్ల ముందుకు వచ్చాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో హల్‌చల్ చేస్తోంది (Viral Video).
snakesaverafsar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పెద్ద కొండచిలువను (Python) పట్టుకుని ఆటలాడుతున్నాడు. కొండచిలువను పట్టుకుని ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో కొండచిలువ అతడికి షాకిచ్చింది. అతడికి బలంగా ముద్దుపెట్టింది. తన నోటితో అతడి చెంపను గట్టిగా పట్టేసుకుని బలంగా కొరికింది. ఆ దెబ్బకు కొండచిలువ పళ్లు అతడి బుగ్గలో ఇరుక్కుపోయాయి. అతను ఎంత ప్రయత్నించినా ఆ కొండచిలువను వదిలించుకోలేకపోయాడు. నొప్పితో ఇబ్బంది పడ్డాడు.
ఆ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. నాలుగు లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. వన్య ప్రాణులతో సరసాలాడే వారికి ఇదే శిక్షఅంటూ ఒకరు కామెంట్ చేశారు. కొండ చిలువ ముద్దు పొందిన అతడు ఎంత అదృష్టవంతుడు అంటూ మరో నెటిజన్ సరదాగా స్పందించాడు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇతను మామూలు దొంగ కాదు.. తాళం కప్పను విడగొట్టడానికి ఎలాంటి ట్రిక్ వాడాడో చూడండి..
ఇన్ని తెలివితేటలు ఎక్కడివి స్వామి.. పాత బల్బును ఎలా మార్చేశారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..