Viral Snake Video: వామ్మో.. దూడను చుట్టుకున్న పాము.. చివరకు ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:20 PM
విషపూరిత సర్పం కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు కోల్పోక తప్పదు. మనుషులే కాదు.. జంతువులు కూడా పాములకు దూరంగా ఉంటాయి. వన్య మృగాలు కూడా పాముల జోలికి వెళ్లేందుకు సాహసించవు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం (Snake) కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు కోల్పోక తప్పదు. మనుషులే కాదు.. జంతువులు కూడా పాములకు దూరంగా ఉంటాయి. వన్య మృగాలు కూడా పాముల జోలికి వెళ్లేందుకు సాహసించవు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు (Snake Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ దూడకు (Calf) ఓ విషపూరిత సర్పం చుట్టుకుంది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలధరించాల్సిందే.
vivek_choudhary అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆ దూడను ఓ ఇంటి గోడకు కట్టేశారు. ఆ దూడ శరీరం చుట్టూ ఒక విషపూరిత సర్పం చుట్టుకుని ఉంది. ఆ పాము దూడ మెడకు గట్టిగా అతుక్కుని ఉండిపోయింది. దాంతో ఆ దూడ ఆ పాము నుంచి విడిపించుకునేందుకు అక్కడే దూకడం ప్రారంభించింది. దీంతో ఆ పాము నెమ్మదిగా దూడ శరీరం నుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోయింది. ఆ వీడియో చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4. 92 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఆ వీడియోను దాదాపు 4 లక్షల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ రెండూ భయంతోనే ఉన్నాయి
, దూడకు ఏమీ కాకపోవడం సంతోషం
, ఆ పాము కొండచిలువలా శరీరాన్ని చుట్టేసింది ఏంటి
అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Girl: నిన్నటి మ్యాచ్‌లో ఈ అమ్మాయిని చూశారా.. సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతోందంటే..
Optical Illusion: ఈ రాళ్ల మధ్యలో జింక ఎక్కడుంది.. ఇది కనిపెడితే మీ కళ్లు సూపర్ షార్ప్..
Business Plan: ఇండియాలో ఇప్పుడిదే డ్రీమ్ బిజినెస్.. నెలకు ఎంత సంపాదనో తెలుసా?
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..