Share News

Viral Girl: నిన్నటి మ్యాచ్‌లో ఈ అమ్మాయిని చూశారా.. సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతోందంటే..

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:09 PM

మంగళవారం భారత్, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్‌కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ వీక్షించిన ఓ అమ్మాయికి సంబంధించిన, ఫొటోలు వీడియోలను చాలా మంది షేర్ చేస్తున్నారు.

Viral Girl: నిన్నటి మ్యాచ్‌లో ఈ అమ్మాయిని చూశారా.. సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతోందంటే..
Viral girl

మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత భారత అభిమానులు అనుభవించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఈ మ్యాచ్‌కు (INDvsAUS) సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ వీక్షించిన ఓ అమ్మాయికి (Viral Girl) సంబంధించిన ఫొటోలు, వీడియోలను చాలా మంది షేర్ చేస్తున్నారు (Viral Video).


ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక అమ్మాయి దుబాయ్ స్టేడియంలో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తోంది. ఆమె టీమిండియా జెర్సీ ధరించి తన ఐఫోన్‌లో మ్యాచ్‌ను వీడియో తీస్తోంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. దీంతో కెమెరా మ్యాన్ కూడా ఆమెపై దృష్టి పెట్టాడు. ఆమె మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీవీ స్క్రీన్ మీద కూడా కనిపించింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అమ్మాయి ఎవరో తెలియదు కానీ, ఆమెకు నెటిజన్లు రకరకల పేర్లు పెడుతున్నారు.


@Poojayadav206 అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు. దాదాపు ఆరు వేల మంది లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆమె చాలా అందంగా ఉంది, బాలీవుడ్ హీరోయిన్‌లా ఉంది అంటూ కామెంట్లు చేశారు. ఆమె బహుశా పాయల్, ఆమెకు పాయల్ గేమింగ్ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్ కూడా ఉందని ఒకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఈ రాళ్ల మధ్యలో జింక ఎక్కడుంది.. ఇది కనిపెడితే మీ కళ్లు సూపర్ షార్ప్..


Business Plan: ఇండియాలో ఇప్పుడిదే డ్రీమ్ బిజినెస్.. నెలకు ఎంత సంపాదనో తెలుసా?


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..

Updated Date - Mar 06 , 2025 | 11:40 AM