Monkey Video: ఈ కోతి నిజంగా ప్రొఫెషనల్.. బట్టలను ఎంత వేగంగా మడతపెడుతోందో చూడండి..
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:43 PM
జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ కోతి ప్రొఫెషనల్‌గా తన పనితనం చూపించింది. ఆ వీడియో చూసిన చాలా మంది జనాలు ఆశ్చర్యపోతున్నారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు ఫన్నీగా, మరికొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు (Animals Videos) చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ కోతి (Monkey) ప్రొఫెషనల్‌గా తన పనితనం చూపించింది. ఆ వీడియో చూసిన చాలా మంది జనాలు ఆశ్చర్యపోతున్నారు. @Yoda4ever అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
సాధారణంగా కోతులు ఎక్కువగా మనుషులను అనుకరిస్తూ ఉంటాయి. మనుషులు చేసే పనులను చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. మనుషుల్లాగానే ఇంటి పనులు కూడా చేసేస్తుంటాయి. బట్టలు ఉతకడం, పాత్రలు శుభ్రం చేయడం, కూరగాయలు కోయడం వంటి అనేక రకాల పనులు చేస్తున్న కోతుల వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ కోతి అతి వేగంగా బట్టలను మడతపెడుతూ కనిపించింది. చాలా మంది మనుషులే అలాంటి పనులు చేయలేరు. అలాంటిది ఆ కోతి చాలా సునాయాసంగా, చాలా చక్కగా బట్టలను మడత పెట్టేస్తోంది (Monkey was seen folding towels).
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. 3.7 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా బాగుంది, అలాంటి కోతులకు నిజంగా ఉద్యోగాలు ఇవ్వాలి``, ``ఆ కోతిని నా స్థానంలో నియమిస్తే మంచిదేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Spider rain in Brazil: ఆకాశం నుంచి సాలెపురుగల వర్షం.. బ్రెజిల్‌లో వింత ఘటన.. కారణం ఏంటో తెలిస్తే..
Viral Video: తలుపు తెరవగానే మృత్యు దేవత.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..
Viral Video: మృత్యువుకే వణుకు పుట్టిస్తున్నాడుగా.. ఈ వృద్ధుడు ఎలా చలి కాచుకుంటున్నాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి