Vlogger Viral Video at Maha Kumbh Mela: మహా కుంభమేళాలో వ్లాగర్.. ఆ పని చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు..
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:31 PM
మహా కుంభమేళా పుణ్యమా అని ఎంతో మంది పేద వ్యాపారులు దండిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. భక్తుల అవసరాలను తీర్చుతూ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు.

Maha Kumbh Mela Vlogger Viral Video: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడికి వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిందని ఉత్తర ప్రదేశ్ సర్కార్ తెలిపింది.
అయితే, ఈ మహా కుంభమేళా పుణ్యమా అని ఎంతో మంది చిరు వ్యాపారులు దండిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. భక్తుల అవసరాలను తీర్చుతూ తమ ఆదాయాన్ని పెంచుకుంటూ లక్షలు సంపాదించుకుంటున్నారు. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు రావడంతో అక్కడ ఆహారం, పానీయాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఈ క్రమంలోనే ఓ సోషల్ మీడియా వ్లాగర్ మహా కుంభమేళాలో టీ అమ్ముతూ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడు. టీ కప్పుకు రూ.10 చొప్పున అమ్ముతూ రోజుకు రూ. 5000 నుండి 7000 వరకు ఆదాయం పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
రోజులో రూ. 5,000 నుండి 7000
ఆ వీడియో క్లిప్‌లో అతను డిస్పోజబుల్ కప్పులతో నిండిన పెద్ద కంటైనర్‌ను తీసుకుని కప్పుకు రూ.10 చొప్పున ప్రజలకు టీ అందిస్తున్నాడు. ఇలా ఒక రోజులో రూ. 5,000 నుండి 7000 వరకు సంపాదిస్తూన్నట్లు తెలిపాడు. ఇలా అతను నెలకు లక్షకు పైగా సంపాదిస్తున్నాడు. అతను పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిని 13.5 మిలియన్ల మంది వీక్షించారు.
Also Read: చౌక రీఛార్జ్ ప్లాన్.. రూ. 108కే 60 రోజుల ప్రయోజనం