Leech In Girls Nose: బాలిక ముక్కులో జలగ.. రెండు నెలలుగా రక్తం తాగుతూ..
ABN , Publish Date - Dec 28 , 2025 | 03:55 PM
రాజస్థాన్‌కు చెందిన ఓ బాలిక ముక్కులోకి జలగ ప్రవేశించింది. రెండు నెలలుగా ముక్కలో ఉండి రక్తం పీలుస్తూ మూడు అంగుళాలు పెరిగింది. ముక్కునుంచి రక్తం కారుతూ ఉండటం.. నొప్పి రావటంతో బాలిక ఆస్పత్రికి వెళ్లింది. దీంతో ముక్కులో జలగ ఉన్న సంగతి బయటపడింది.
సాధారణంగా జలగలు మన చర్మాన్ని పట్టుకుంటే నొప్పి కూడా తెలియకుండా రక్తాన్ని పీలుస్తూ జీవిస్తాయి. మనం వాటిని చూస్తే గానీ అక్కడ జలగ ఉందన్న సంగతి గుర్తించలేము. ఒక వేళ జలగ ముక్కులోకో.. చెవిలోకో వెళితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చిన్న జలగ భారీ ఆకారంలోకి మారే వరకు ఆ విషయాన్ని కనిపెట్టలేము. తాజాగా, ఓ బాలిక ముక్కులోకి జలగ ప్రవేశించింది. రెండు నెలలుగా ఆమె రక్తం పీలుస్తూ అక్కడే ఉండిపోయింది. ముక్కునుంచి రక్తం కారుతూ ఉండటం.. నొప్పి రావటంతో బాలిక ఆస్పత్రికి వెళ్లింది. దీంతో ముక్కులో జలగ ఉన్న సంగతి బయటపడింది.
ఈ సంఘటన రాజస్థాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి చెందిన 12 సంవత్సరాల ఓ బాలిక రెండు నెలల క్రితం బర్రెలు మేపడానికి అడవికి వెళ్లింది. అక్కడ దాహం వేయటంతో కాలువలోని నీటిని తాగింది. ఆ సమయంలో ఓ చిన్న జలగ నీటిలోంచి ఆమె ముక్కులోకి ప్రవేశించింది. అక్కడే ఉండి రక్తం పీలుస్తూ జీవించసాగింది. రెండు నెలలు గడిచిపోయాయి. చిన్న జలగ కాస్తా పెద్దగా మారిపోయింది. దీంతో బాలికకు ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా మారింది. ముక్కులో నొప్పి కూడా రావటం మొదలైంది.
రక్తం కూడా కారుతూ ఉంది. రోజు రోజుకు సమస్య పెద్దది అవ్వటంతో తల్లిదండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక ముక్కును పరీక్షించిన వైద్యులు లోపల జలగ ఉన్నట్లు గుర్తించారు. ఎంతో కష్టపడి దాన్ని బయటకు తీశారు. ఆ జలగ మూడు అంగుళాల పొడువు ఉంది. దాన్ని చూసి అక్కడి వారందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇంకా కొన్ని రోజులు అలానే ఉండిఉంటే చాలా ప్రమాదం జరిగేది’..‘అమ్మ బాబోయ్ జలగ అంత పెద్దగా ఉందేంటి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ఏడాది ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి
వైద్య ప్రపంచంలోనే అద్భుతం.. పాదం మీద చెవి పెట్టి కాపాడారు..