Buffalo Lions Viral: సింహాల గుంపు మీద పడినా.. బిడ్డ కోసం తల్లి దున్నపోతు ఎంతకు తెగించిందో చూస్తే..
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:41 PM
Buffalo Lions Viral Video: తల్లి ప్రేమ ఎంత గొప్పదో మరోసారి రుజువైంది. సింహాల గుంపు మీద పడినా బిడ్డను కాపాడుకునేందుకు ఓ దున్నపోతు చేసిన సాహసం చూస్తే కచ్చితంగా కళ్లు చెమ్మగిల్లుతాయి. సింహాలతో ధైర్యంగా పోరాడుతున్న దున్నపోతు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Buffalo Lions Viral Video: అడవిలో మనుగడ సాగించాలంటే రోజూ ప్రాణం కోసం పోరాటం చేయాల్సిందే. సాధారణంగా ఒక్క సింహం ఎదురుతిరిగితేనే ఏనుగు వంటి భారీ జీవులు సైతం పోరాడేందుకు వెనకడుగు వేస్తాయి. కానీ, ఓ తల్లి దున్నపోతు కన్నప్రేమకు సింహాల గుంపే తోక ముడిచి పారిపోయాయి. సింహాల నుంచి బిడ్డను రక్షించుకునేందుకు తల్లి దున్నపోతు పోరాటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరలవుతోంది. దున్నపోతు, సింహాల గుంపు మధ్య జరిగిన యుద్ధం చూస్తే గూస్ బంప్స్ రాకుండా ఉండవు.
డెన్నిస్ కోషల్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ షేర్ చేసిన ఈ వీడియో కెన్యా దేశంలోని మసాయ్ మారా అడవి తీసింది. ఇందులో,"" ఒక చిన్న దున్నపోతు దూడ ఒంటరిగా నిలబడి ఉంటుంది. దాని చుట్టూ ఆకలితో ఉన్న సింహాల గుండెలు మూగి ఉంటాయి. చూస్తుండగానే ఒక సింహం దూడ వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చి మీద పడింది. అదే క్షణంలో దూరంగా ఎక్కడో ఉన్న తల్లి దున్నపోతు వేగంగా బిడ్డ వైపు దూసుకొచ్చి సింహాన్ని దూరాన్ని తరిమేసింది. తర్వాత సింహాలు వెనక్కి తగ్గవు. ఒంటరిగా ఉన్న తల్లి దున్నపోతుతో పోరాటానికి దిగుతాయి. ఎదిరిస్తూ, చుట్టూ తిరుగుతూ దాడి చేసినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. శక్తి సన్నగిల్లుతున్నా బిడ్డను కాపాడుకునేందుకు కొమ్ములతో ధైర్యంగా సింహాలను ఎదిరిస్తూనే ఉంటుంది దున్నపోతు. ఇక దున్నపోతుంది లొంగిపోతుంది అనుకునేంతలో పెద్ద ట్విస్ట్. దూరంగా ఒక్కసారిగా దున్నపోతుల గుంపు వస్తున్న శబ్దాలతో తల్లి దున్నపోతులో మళ్లీ ఆశ చిగురిస్తుంది. చూస్తుండగానే పదుల సంఖ్యలో దున్నపోతుల మంద వచ్చేస్తుంది. అంతే, ఒక్కసారిగా సింహాలు బెదిరిపోయి పారిపోతాయి."
ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు దున్నపోతు ధైర్యాన్ని, మంద ఐక్యతను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. "ఇది సినిమా కాదు, నిజమైన ప్రేమ!", "తలి ప్రేమ అంటే ఇదే " అని కామెంట్లు చేశారు. కానీ, చివరికి తల్లి దున్నపోతు పోరాటం వృథానే అయింది. ఈ విషయాన్ని డెన్నిస్ కోషల్ తర్వాత పోస్ట్‌లో షేర్ చేశారు." గొప్పగా పోరాడినా దూడ బతకలేదు. సింహాలు చివరికి విజయం సాధించాయి. ప్రకృతి కొన్నిసార్లు క్రూరంగా ఉంటుంది. ఇదే జీవన చక్రం, బలమైనవాడే గెలుస్తాడు," అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ వీడియో ఒక తల్లి ప్రేమ, ధైర్యం, ఐక్యత గురించి మనకు చెబుతుంది. ఒక బిడ్డ కోసం తల్లి ఎంత దూరమైనా వెళ్తుంది. అల్పులైనా గుంపుగా నిలిచి పోరాడితే బలవంతుడిపై విజయం సాధించగలరని ఈ సంఘటన చాటుతుంది. ప్రకృతి కఠినమైనా ఈ ధైర్యసాహసాలు అందరిలో ఆశలు నింపుతాయి. మీరు ఈ వీడియో చూసేయండి మరి.
Optical Illusion Test: మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి
Viral Video:ఈ పిల్లాడు మామూలోడు కాదు.. బొమ్మ హెలికాఫ్టర్ ఎగరటం లేదని పోలీస్ కంప్లైంట్..