Donkey In Pakistan Parliament: పాకిస్థాన్ పార్లమెంట్‌లోకి గాడిద.. వీడియోలో నిజమెంత?..
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:16 PM
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ గాడిద వీడియో వైరల్‌గా మారింది. ఆ గాడిద పాకిస్థాన్ పార్లమెంట్‌లోకి చొచ్చుకుపోయిందని బాగా ప్రచారం జరుగుతోంది. ఆ వీడియో నిజమైనదా? లేక ఏఐతో తయారు చేసిందా?..
ఏఐ వాడకం పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా మొత్తం పాడైపోయిందని చెప్పాలి. కొంతమంది ఏఐ సాయంతో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తుంటే.. అది ఒరిజినలా.. లేక ఏఐతో తయారు చేసిందా అన్నది కనుక్కోలేని పరిస్థితి వచ్చింది. ఏఐతో తయారు చేసిన ఫొటోలు, వీడియోలు అచ్చం నిజమైన వాటిలా ఉంటున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది. పాకిస్థాన్ పార్లమెంట్‌లోకి ఓ గాడిద చొరబడిందంటూ ఆ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. పాకిస్థాన్ పార్లమెంట్‌లోకి ఓ గాడిద దూసుకుని వచ్చింది. సీట్లలో కూర్చున్న వారిని తోసుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. గాడిద ఢీకొనటంతో కొంతమంది నేతలు కుర్చీల్లోంచి కిందపడిపోయారు. 10 సెకన్ల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది అది ఏఐతో తయారు చేసిన రియలస్టిక్ వీడియో అంటున్నారు. మరికొంత మంది పాకిస్థాన్ పార్లమెంట్‌లో అది నిజంగానే జరిగిందని అంటున్నారు. ‘ఆ వీడియో నిజమైనది కాదు. ఏఐతో తయారు చేసింది’..
‘పాపం.. పాకిస్థాన్ రాజకీయ నాయకులకు కొంచెం కూడా భద్రత లేదు. ఏకంగా పార్లమెంట్‌లోకి గాడిదలు వచ్చేస్తున్నాయి’..‘ఏఐతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇందుకు ఈ వీడియోనే ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఏఐతో తయారు చేసిన వీడియో అయినా వాస్తవానికి అత్యంత దగ్గరగా ఉంది’..‘ఈ వీడియో ఎవరు తయారు చేశారో కానీ, భలే బాగా చేశారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆ వీడియో నిజమైనదా? లేక ఏఐతో తయారు చేసిందా? అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.
ఇవి కూడా చదవండి
పదేళ్ల దోపిడీ ఇంకా చాల్లేదా కేసీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు
పాము ముందు బూర ఊదమంటే.. ఏకంగా ఏడిపించాడుగా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..