Share News

Viral CCTV Video: బరితెగించిన యువకుడు.. రోడ్డుపై వెళుతున్న యువతితో..

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:31 PM

ఉత్తర ప్రదేశ్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న ఓ యువకుడు రోడ్డుపై వెళుతున్న ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు.

Viral CCTV Video: బరితెగించిన యువకుడు.. రోడ్డుపై వెళుతున్న యువతితో..
Viral CCTV Video

ఈ మధ్య కాలంలో కొంతమంది మగాళ్లు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు ఎవ్వరినీ వదలటం లేదు. తమ పాడు చేష్టలతో వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు నిత్యం ఎక్కడో చోట కీచక మగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఆడవారితో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న ఓ యువకుడు రోడ్డుపై వెళుతున్న ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి ఓ వీధిలో నడుచుకుంటూ వెళుతోంది. వారికి ఎదురుగా బైకుపై ఓ ఇద్దరు యువకులు వెళుతూ ఉన్నారు. యువతుల దగ్గరకు రాగానే వెనకాల సీటులో కూర్చున్న యువకుడు దారుణమైన పనికి తెరతీశాడు. తన కుడి చేతి వైపు ఉన్న యువతి ముఖంపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆ యువతి షాక్ అయింది. ఒక్క సారిగా భయపడిపోయింది. పక్కనే ఉన్న యువతి పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ యువకులు మాత్రం ఏమీ పట్టించుకోకుండా బైకుపై అక్కడినుంచి వెళ్లిపోయారు. వారు ఎవరు? ఎందుకు కొట్టారు? అన్నది ఆ యువతులకు అర్థం కాలేదు.


బైకుపై వెళుతున్న యువకుల వైపు చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీల వీడియోను రాహుల్ సైనీ అనే వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. పట్ట పగలు కూడా ఆడవారికి రక్షణ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పోలీసులు సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు హత్రాస్ పోలీసులు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు కూడా పెట్టారు.


ఇవి కూడా చదవండి

కళ్లకు గంతలతో 8వ తరగతి పరీక్ష..

వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రూట్‌లో వెళ్లకండి..

Updated Date - Dec 13 , 2025 | 12:37 PM