Vince Zampella: ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సృష్టికర్త విన్స్ జంపెల్లా దుర్మరణం
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:30 PM
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు రోడ్డు ప్రమాదంలో గాయపడటం, కన్నుమూయడం చూస్తునే ఉన్నాం. ప్రముఖ వీడియో గేమింగ్ దిగ్గజం "కాల్ ఆఫ్ డ్యూటీ" సృష్టికర్త కన్నుమూశారు.
‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సిరీస్ సృష్టికర్త.. అతి తక్కువ సమయంలో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మేధావి విన్స్ జాంపెల్లా(Vince Zampella) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన వయస్సు 55 సంవత్సరాలు. కాలిఫోర్నియాలో ఫెరారీ స్పోర్ట్స్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో హఠా జంపెల్లా కన్నుమూశారు. వీడియో గేమ్ రంగంలో ఆయనకు ఎంతో పేరు ఉంది.
టైటాన్ ఫాల్, అపెక్స్ లెజెండ్స్, స్టార్ వార్స్ జెడీ వంటి గేమ్స్ ని డెవలప్ చేశారు. జంపెల్లా అకాల మరణంతో వీడియో గేమ్స్ ఫ్యాన్స్ దుఃఖసాగరంలో మునిగిపోయారు. జాంపెల్లా ఇన్ఫినిటీ వార్డ్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటీవ్ గా పనిచేశారు. కాల్ ఆఫ్ డ్యూటీ సిరీస్‌ను ఆ కంపెనీయే డెవలప్ చేసింది. ఈ వీడియో గేమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా వీడియో గేమింగ్ రంగంలో జాంపెల్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 2003 లో తొలిసారి వరల్డ్ వార్ 2 పేరుతో వీడియో గేమ్ డెవలప్ చేసి విడుదల చేశారు.

ఈ గేమ్ అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించింది. ఏకంగా 50 కోట్ల కాపీలు అమ్ముడు పోయాయి. ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ గేమ్ తో జాంపెల్లా బాగా పేరు సంపాదించాడు. ఈ గేమ్ నెలకు వంద మిలియన్లకు పైగా యాక్టీవ్ ప్లేయర్లను కలిగి ఉంది. వీడియో గేమ్ వరల్డ్ లో జాంపెల్లా ప్రస్థానం ముగియడం ఎంతో విషాదం అని ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ఆగని హింస, బీఎన్‌పీ నేత ఇంటికి నిప్పు.. ఏడేళ్ల కుమార్తె సజీవదహనం