Varanasi: వారణాసి వెళ్తున్నారా.. గుడ్ న్యూస్
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:43 PM
ఆ విశ్వేశ్వరుడిని దర్శించుకునేందు వారణాసి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. పవిత్ర గంగానదిలోని వివిధ ఘాట్ల మధ్య భక్తులు ప్రయాణించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
లక్నో, డిసెంబర్ 11: హైడ్రోజన్ పవర్డ్ వాటర్ ట్యాక్సీ సేవలు తొలిసారిగా వారణాసిలో అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో తొలి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వాటర్ ట్యాక్సీని కేంద్రం పోర్టులు, నౌకాయాన శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాలా ప్రారంభించారు. బుధవారం వారణాసిలోని నమో ఘాట్‌లో ఈ వాటర్ ట్యాక్సీని ఆయన ప్రారంభించారు. ఈ వాటర్ ట్యాక్సీని స్థానిక నమో ఘాట్ నుంచి రవిదాస్ ఘాట్ మధ్య నడుపుతామని నిర్వాహాకులు తెలిపారు. ఈ వాటర్ ట్యాక్సీ సేవలు అసి ఘాట్, మార్కండేయ దామ్ వరకు పొగిడించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వారు వివరించారు.

ఈ ట్యాక్సీని కొచ్చి షిప్ యార్డ్‌లో నిర్మించారు. ఈ ట్యాక్సీలో పూర్తిగా శాఖహారం అందుబాటులో ఉంటుంది. ఈ ట్యాక్సీలో సీసీ టీవీ నిఘాతోపాటు బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఈ ట్యాక్సీ.. నమో ఘాట్ నుంచి రవిదాస్ ఘాట్ల మధ్య రోజుకు 6 నుంచి 7 ట్రిప్పులు తిరుగుతుంది. ఒక ట్రిప్పునకు 50 మందికి మాత్రమే వాటర్ ట్యాక్సీలోని అనుమతించనున్నారు.
హైబ్రిడ్ ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఇంజిన్‌తో ఈ వాటర్ ట్యాక్సీ నడుస్తుంది. ఇది శబ్ద కాలుష్యం లేకుండా ప్రయాణం చేస్తుంది. ఇందులో ఐదు హైడ్రోజన్ సిలిండర్లతోపాటు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. ఈ వాటర్ ట్యాక్సీ గంటకు 12,038 కిలోమీటర్ల ప్రయాణిస్తుందని నిర్వాహాకులు వివరించారు.
ఈ వాటర్ ట్యాక్సీలో.. టికెట్ ధర..
ఒక్కరికి ఒక ట్రిప్‌కు రూ.500 ధరగా నిర్ణయించారు.
ఈ ట్యాక్సీ సర్వీస్ ప్రతి రోజు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తాయి. గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది.
ఈ ట్యాక్సీలో ప్రయాణం చేయాలనుకునే వారు.. నమో ఘాట్ లేదా రవిదాస్ ఘాట్‌లో మాత్రమే ఎక్కవలసి ఉంటుంది. భవిష్యత్తులో అసి ఘాట్, మార్కండేయ దామంలలో కూడా స్టాప్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఒక ట్రిప్‌కు కేవలం 50 మందికి మాత్రమే ఈ వాటర్ ట్యాక్సీలోకి అనుమతి ఇస్తారు.
ఈ వాటర్ ట్యాక్సీలో ప్రయాణం.. ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు..
తొలుత వారణాసిలోని ట్రస్ట్ బోట్ బుకింగ్ వెబ్ సైట్స్‌లోకి వెళ్లాలి. హైడ్రోజన్ వాటర్ ట్యాక్సీ సర్వీసులను పరిశీలించారు. మనం ప్రయాణించే సమయాన్ని బట్టి.. నమో ఘాట్ నుంచి రవిదాస్ ఘాట్ రూట్‌లో ట్రిప్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
టికెట్లను ఫోన్ లేదా వాట్సప్‌లో బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ పూర్తయే ముందు ఆన్ లైన్‌లో నగదు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఫోన్‌కు సందేశం వస్తుంది. దీనితోపాటు కొనుగోలు చేసిన టికెట్‌ను ఘాట్ వద్ద నిర్వాహకులకు చూపించాల్సి ఉంటుంది.
విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులకు రాయితీ..?
ఈ వాటర్ ట్యాక్సీలో ప్రయాణించే ఏ ఒక్కరికి రాయితీ ఇవ్వడం లేదు. అంటే విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులకు ఇలా ఎవరికి ఎటువంటి రాయితీపై టికెట్లు ఇవ్వడం లేదు. దాంతో ఈ ట్యాక్సీ ఎక్కాలనుకునే వారు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా సరే.. రూ. 500 చెల్లించి టికెట్ కొనుగోలు చేయాల్సిందే.