Valentine Agreement: భార్యాభర్తల మధ్య వెరైటీ అగ్రిమెంట్.. వారు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే..
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:08 PM
వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఓ ప్రేమ జంటకు సంబంధించిన విచిత్రమైన అగ్రిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రిమెంట్ పేరుతో దంపతులు ఇరువురూ ఎలాంటి షరతులు విధించుకున్నారో చూస్తే నవ్వు రాకమానదు.

ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవం. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా ఈ రోజును మరపురానిదిగా మార్చుకుంటారు. ఎంతో అన్యోన్యంగా గడుపుతారు. అయితే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఓ ప్రేమ జంటకు (Lovers) సంబంధించిన విచిత్రమైన అగ్రిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగ్రిమెంట్ పేరుతో దంపతులు ఇరువురూ ఎలాంటి షరతులు విధించుకున్నారో చూస్తే నవ్వు రాకమానదు. (Valentine Agreement)
వివాహం అయి రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత భార్యాభర్తలు (Husband and Wife) ఓ అగ్రిమెంట్ విచిత్రమైన అగ్రిమెంట్ రూపొందించుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా అనయ, శుభమ్ అనే దంపతులు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో భర్తకు భార్య పెట్టిన షరతులు ఏంటంటే.. ``1) భోజనం చేసేటపుడు కుటుంబ సంబంధ విషయాలు మాత్రమే మాట్లాడాలి. ట్రేడింగ్ గురించి మాట్లాడకూడదు. 2) బెడ్రూమ్‌లో స్టాక్ మార్కెట్ లాభాలు, నష్టాల గురించి మాట్లాడకూడదు. 3) నన్ను (అనయ) బ్యూటీ కాయిన్, క్రిప్టో పై అని పిలవడం మానెయ్యాలి 4) రాత్రి 9 గంటల తర్వాత ట్రేడింగ్‌కు సంబంధించిన యాప్స్, వీడియోలు చూడకూడదు`` అని పేర్కొంది.
అలాగే భర్త కూడా భార్యకు కొన్ని షరతులు విధించాడు. ``1) శుభమ్ ప్రవర్తన గురించి అమ్మకు ఫిర్యాదు చేయడం అనయ మానాలి. 2)వాదన సమయంలో శుభమ్ మాజీ ప్రేయసి ప్రస్తావన తీసుకురాకూడదు. 3)ఖరీదైన స్కిన్ కేర్ ఉత్పత్తులు కొనకూడదు 4)స్విగ్గీ, జొమాటో నుంచి రాత్రి పూట ఫుడ్ ఆర్డర్ చేయకూడదు`` అంటూ భార్యకు భర్తకు నిబంధనలు విధించాడు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే.. మూడు నెలల పాటు బట్టలు ఉతకాలని, టాయిలెట్లు శుభ్రం చేయాలని, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావాలని రాసుకున్నారు. ఈ ఫన్నీ అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
Shark Video: షాకింగ్ వీడియో.. సముద్రపు ఒడ్డున మొసలి.. ఓ షార్క్ వచ్చి ఏం చేసిందో చూడండి..
Funny: మంచి కిక్ ఇచ్చే మార్కెటింగ్ టెక్నిక్.. మందు బాబులను ఎలా పిలుస్తున్నాడో చూడండి..
Viral Groom video: సోదరా.. పెళ్లి వద్దు.. సిగ్నల్‌ను అర్థం చేసుకో.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..