Share News

Varanasi Home Go Viral: ఛీ ఛీ మరీ ఇంత దారుణమా.. చెట్టును డైపర్ చెట్టు చేసేశారు..

ABN , Publish Date - Dec 05 , 2025 | 06:56 PM

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన భార్యాభర్తలు చంటి బిడ్డ మల, మూత్రాలు ఉండే డైపర్లను తీసి నిత్యం ఇంటి ముందు ఉండే చెట్టుపై వేస్తూ ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 100 దాకా డైపర్లతో ఆ చెట్టు డైపర్ల చెట్టుగా మారింది.

Varanasi Home Go Viral: ఛీ ఛీ మరీ ఇంత దారుణమా.. చెట్టును డైపర్ చెట్టు చేసేశారు..
Varanasi Home Go Viral

పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకునే విషయంలో భారతదేశం ఎప్పుడూ లీస్ట్ ప్లేస్‌లోనే ఉంటుంది. చదువుకున్న వారు.. చదువులేని వారు అన్న తేడా లేకుండా ఎక్కువ శాతం మంది జనాలకు సామాజిక స్పృహ అస్సలు ఉండటం లేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తున్నారు. పరిసరాల్ని చెత్త కుప్పల్లా మార్చేస్తున్నారు. ఇందుకు ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఓ జంట తమ ఇంటి ముందు ఉండే చెట్టును అసహ్యంగా మార్చేసింది. చంటి బిడ్డ డైపర్లను చెట్టుపై వేసి దారుణం చేసేసింది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వారణాసికి చెందిన ఓ భార్యాభర్తల జంట కొన్ని నెలల క్రితం ఓ చంటి బిడ్డకు జన్మనిచ్చింది. భార్యాభర్తలు చంటి బిడ్డ మల, మూత్రాలు ఉండే డైపర్లను తీసి నిత్యం ఇంటి ముందు ఉండే చెట్టుపై వేస్తూ ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 100 దాకా డైపర్లతో ఆ చెట్టు డైపర్ల చెట్టుగా మారింది. చెట్టు నిండా, చుట్టు పక్కల కూడా డైపర్లే దర్శనం ఇస్తున్నాయి. ఇది గమనించిన పొరిగింటి వారు ఆగ్రహానికి గురయ్యారు. సదరు భార్యాభర్తలతో గొడవకు దిగారు.


ఇకపై చెట్టుపై డైపర్లు వేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రస్తుతం డైపర్ చెట్టుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇండియాలో ఉండే జనాలకు చాలా బద్ధకం. అందుకే తమ చుట్టూ ఉండే పరిసరాల్ని ఇలా పాడుచేస్తూ ఉంటారు’..‘ఇలా పరిసరాల్ని పాడు చేసే వారిని ఊరికే వదిలేయకూడదు. జైల్లో పడేయాలి’.. ‘ఛీ ఛీ మీరసలు మనుషులేనా. మీలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్.. వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండా!

నచ్చిన వాచీలు పెట్టుకుంటాం.. శాంటోస్ డి కార్టియర్ వాచ్‌పై డీకే క్లారిటీ

Updated Date - Dec 05 , 2025 | 07:00 PM