Share News

Woman Battles Alligator: మొసలితో మహిళ యుద్ధం! దాని వీపు మీదెక్కి భీకర పోరాటం

ABN , Publish Date - Apr 05 , 2025 | 10:04 PM

తన పెంపుడు కుక్కను కాపాడుకునేందుకు ఏకంగా మొసలితో యుద్ధం చేసిన మహిళ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అపూర్వ ధైర్యసాహసాలు కనబరిచిన ఈ అమెరికా మహిళపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Woman Battles Alligator: మొసలితో మహిళ యుద్ధం! దాని వీపు మీదెక్కి భీకర పోరాటం
Woman Battles Alligator to Save Dog

ఇంటర్నెట్ డెస్క్: మనిషి పట్ల అత్యంత విశ్వాసంతో ఉండే ఒకే ఒక జంతువు శునకం. యజమానుల ప్రాణాలు కాపాడుకునేందుకు అవి ఎంతటి సాహసానికైనా వెనకాడవు. అయితే, కొందరు తమ పెంపుడు శునకాల పట్ల అంతే అభిమానం కలిగి ఉంటారు. వాటి కోసం తమ ప్రాణాలను అడ్డేసేందుకు కూడా వెనకాడదు. అలాంటి ఓ అమెరికా మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ధైర్యస్థైర్యాలు, పెంపుడు జంతువు పట్ల ఆమె కున్న అభిమానం చూసి జనాలు ఆశ్చర్యానందాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లోరిడాకు చెందిన కిమ్ స్పె్న్సర్ అనే మహిళ తన పెంపుడు కుక్క కోనాతో కలిసి ఇటీవల ఓ రాత్రి స్థానిక కొలను వద్ద వాకింగ్‌ చేస్తుండగా అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఓ భారీ మొసలి అకస్మాత్తుగా నీటి లోంచి బయటకొచ్చి వారిపై దాడికి యత్నించింది. దాదాపు ఆరడుగులు ఉన్న ఆ మొసలి శునకాన్నే టార్గెట్ చేసుకుంది. అమాంతం దాన్ని నోటపట్టి నీళ్లల్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది.


ఇది చూసిన కిమ్ షాకైపోయింది. ఆ పరిస్థితిల్లో ఏం చేయాలో అర్ధంకాక క్షణకాలం పాటు అలాగే నిలబడిపోయింది. ఆ వెంటనే తెరుకున్న ఆమె ఒక్కసారిగా మొసలి మీదకు దూకింది. దాని నోటిని బలవంతంగా తెరిచి కుక్కను విడిపించుకుంది. ఈ క్రమంలో కిమ్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈలోపు మొసలి మళ్లీ నీళ్లల్లోకి పారిపోయింది.

అయితే, కుక్కతో పాటు ఆమె కూడా ప్రాణాలతో బయటపడినందుకు బంధువులు శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు. తాను సుమారు ఏడేళ్ల క్రితం ఆ శునకాన్ని తెచ్చుకున్నట్టు కిమ్ పేర్కొంది. దాన్ని ప్రాణం కంటే మిన్నగా పెంచుకుంటున్నానని, కుక్కకు ఏమైనా అయితే చూసి తట్టుకోలేనని చెప్పింది. ఆ క్షణంలో తనకు అనిపించింది చేశానని, మొసలితో ప్రమాదం ఉందన్న విషయం ఆ సమయంలో తన స్ఫృరణకు కూడా రాలేదని చెప్పింది.


ఇక ఫ్లోరిడా వణ్యప్రాణి సంరక్షణ శాఖ లెక్కల ప్రకారం, ఆ రాష్ట్రంలో సుమారు 1.3 మిలియన్ వరకూ వివిధ సైజుల్లో మొసళ్లు ఉన్నాయి. మొసలి దాడికి సంబంధించిన 11 ఘటనలు గతేడాది రాష్ట్రంలో వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోడిని ఎత్తుకెళ్లి.. పోలీసులు వచ్చేసరికి వలవలా ఏడుస్తూ..

దేవుడా..ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారా.. ఈ ప్రిస్క్రిప్షన్ చూస్తే..

అత్తపై కోడలి పైశాచికత్వం.. వృద్ధురాలని కూడా చూడకుండా జుట్టుపై నేలపై ఈడుస్తూ..

Read Latest and Viral News

Updated Date - Apr 05 , 2025 | 10:04 PM