US Teen Fought with Alligator: నీటిలోని మొసలికి చిక్కిన పదిహేనేళ్ల బాలిక.. ఎలా పోరాడి ప్రాణాలను దక్కించుకుందంటే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:47 AM
ఎంత పెద్ద జంతువు అయినా నీటిలోకి వెళ్లి మొసలి నోటికి చిక్కిందంటే అది తన ప్రాణం మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. నీటిలోని మొసలి ముందు ఏనుగు బలం కూడా సరిపోదు. అలాంటిది ఒక పదిహేనేళ్ల బాలిక మొసలి నోటికి చిక్కి కూడా ధైర్యంగా పోరాడి ప్రాణాలతో బయటపడింది.
నీటిలో మొసళ్లు (Crocodiles) అత్యంత బలమైనవి. ఎంత పెద్ద జంతువు అయినా నీటిలోకి వెళ్లి మొసలి నోటికి చిక్కిందంటే అది తన ప్రాణం మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. నీటిలోని మొసలి ముందు ఏనుగు బలం కూడా సరిపోదు. అలాంటిది ఒక పదిహేనేళ్ల బాలిక మొసలి నోటికి చిక్కి కూడా ధైర్యంగా పోరాడి ప్రాణాలతో బయటపడింది. తీవ్రంగా గాయపడినా తన ప్రాణాలను మాత్రం దక్కించుకుంది. అమెరికా (USA)లోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది (US Teen Fought with Alligator).
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 15 ఏళ్ల బాలిక సమ్మర్ హినోట్ జూన్ 22వ తేదీన పాండ్ క్రీక్ సరస్సులో తన స్నేహితురాళ్లతో కలిసి ఈత కొడుతోంది. ఆ సమయంలో నీటి అడుగు నుంచి ఓ మొసలి వచ్చి హినోట్ కాలును పట్టుకుంది. ఆమెను నీటి అడుగుకు తీసుకెళ్లిపోయింది. అయితే హినోట్ ధైర్యంగా పోరాడింది. మొసలి తలపై బలంగా కొట్టడం ప్రారంభించింది. దీంతో మొసలి ఆ బాలికను వదిలేసింది. అయితే మరుక్షణంలో తిరిగి పట్టుకుంది. హినోట్ కాలును గట్టిగా కొరికి కదలకుండా పట్టుకుంది. అయినా హినోట్ తన పోరాటాన్ని ఆపలేదు.
చేతులతో, మరో కాలితో మొసలిపై దాడి చేస్తూనే ఉంది. ఆ సమయంలో హినోట్ కాలును మరింత గట్టిగా పట్టుకునేందుకు మొసలి ఒకసారి నోరు తెరిచింది. ఆ సమయంలో హినోట్ వేగంగా ఈదుకుంటూ పైకి వచ్చేసింది. అంతలో స్నేహితురాలు వెంటనే హినోట్‌ను పైకి లాగేసింది. హినోట్‌ను ఎత్తుకుని వేగంగా ఒడ్డు వైపు పరుగులు పెట్టింది. దీంతో మొసలి వారిని పట్టుకోలేకపోయింది. అయితే ఈ దాడిలో హినోట్ కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆ కాలిని తొలిగించాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చిన్న పిల్లలకు వంటింటి చిట్కా.. ఎంత ప్రమాదకరం అంటే..
గర్ల్‌ఫ్రెండ్‌ను ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన యువకుడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..